నిమ్మగడ్డకు మధ్యంతర బెయిల్ మంజూరు

11 Jul, 2013 18:56 IST|Sakshi
నిమ్మగడ్డకు మధ్యంతర బెయిల్ మంజూరు

హైదరాబాద్ : వాన్పిక్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్కు  గురువారం మధ్యంతర బెయిల్ మంజూరు అయ్యింది. ఆయనకు నాంపల్లి సీబీఐ కోర్టు 13రోజుల పాటు షరతులతో కూడిన  మధ్యంతర బెయిల్ ఇచ్చింది. నిమ్మగడ్డ మామ రాంప్రకాష్  చనిపోయినందున కర్మకాండ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన ఈరోజు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

 

పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు బెయిల్ మంజూరు  చేసింది. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలకు వరకూ కోర్టు అనుమతి ఇచ్చింది. బెయిల్ సమయంలో నిమ్మగడ్డ ప్రసాద్ తన కుటుంబ సభ్యులతో మాత్రమే సంభాషించాలని న్యాయస్థానం షరతులు విధించింది. నిమ్మగడ్డ ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉన్నారు.

మరిన్ని వార్తలు