కృష్ణుడి రూపంలో 13 అడుగుల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం

28 May, 2015 01:52 IST|Sakshi

కొత్తపేట : విశ్వవిఖ్యాత నటసార్వభౌమునిగా ఖ్యాతినందిన మహానటుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శ్రీకృష్ణుని రూపంలో ఉన్న 13 అడుగుల కాంస్య విగ్రహాన్ని రూపొందించనున్నట్టు తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్ తెలిపారు.
 
 బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను రూపొందించి న అదే తరహా విగ్రహాన్ని అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో వెస్ట్ కొవిన్(కాలిఫోర్నియా)లో నెలకొల్పేందుకు ఇప్పటికే తరలించినట్టు చెప్పారు. ఆ విగ్రహం ఫొటోను ‘సాక్షి’లో చూసిన రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ అలాంటిదే రాజమండ్రిలో పుష్కరఘాట్ వద్ద పాత, కొత్త రైలు వంతెనల మధ్య నెలకొల్పాలని ప్రతిపాదించగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించారని తెలిపారు.
 
  విగ్రహం రూపకల్పనకు ఎంపీఆర్డర్ ఇచ్చారని, దానికయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. సుమారు 12 అడుగుల పెడెస్టల్‌పై విగ్రహాన్ని నెలకొల్పే చోటును ఇప్పటికే ఎంపీ మురళీమోహన్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరితో కలిసి పరిశీలించినట్టు తెలిపారు.
 

మరిన్ని వార్తలు