‘రిమ్స్’లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

21 Aug, 2013 05:07 IST|Sakshi
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : రిమ్స్ నర్సింగ్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు లు ఆహ్వానిస్తున్నట్లు డెరైక్టర్ అంజయ్య తెలిపారు. స్థానిక తన చాంబర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2013-14 విద్యాసంవత్సరానికి రిమ్స్ నర్సింగ్ కళాశాలలో 60 సీట్లను ఆన్‌లైన్ ద్వారా భర్తీచేయనున్నట్లు చెప్పారు. దరఖాస్తు చేసుకునేందుకు డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్ (http://dmeap.nic.in)లో లాగిన్ అవ్వాలన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తిచేసి ప్రింట్‌తీయాలని, ఆ కాపీని రిమ్స్‌లోని నర్సింగ్ కళాశాలలో అందజేయాలని సూచించారు. దాంతో పాటు విద్యార్హత, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు అందజేయాలన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 11 చివరితేదీగా వెల్లడించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అనంతరం ఆ కాపీని రిమ్స్ నర్సింగ్ కళాశాలలో అందజేసేందుకు అక్టోబర్ 21వ చివరితేదీగా పేర్కొన్నారు.
 
అదేనెల 30వ తేదీలోపు విద్యార్థుల ఎంపికను పూర్తిచేస్తామన్నారు. నవంబర్ 4వ తేదీ నుంచి విద్యార్థులకు తరగతులు జరుగుతాయని తెలిపారు. రిజిస్ట్రేషన్ రుసుం కింద 100 రూపాయలను చలానా రూపంలో ఃకార్యాలయ పర్యవేక్షణాధికారి, రిమ్స్, ఒంగోలుూ, అనే చిరునామాతో డీడీఓ కోడ్ 07010902001కు చెల్లించాలని సూచించారు. ఇంటర్‌లో బైపీసీ, ఒకేషనల్‌లో నర్సింగ్ కోర్సు చదివిన వారు, ఇన్ సర్వీస్‌లో ఉన్న ఏఎన్‌ఎంలు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని అంజయ్య వివరించారు. అర్హులకు ప్రభుత్వం ఉపకార వేతనాలు కూడా మంజూరు చేస్తుందన్నారు. మరిన్ని వివరాలకు నర్సింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పి.రాజశ్రీ (99481 36229), కృష్ణవేణి (98493 71688)లను సంప్రదించాలని కోరారు.
 
 నర్సింగ్ కౌన్సెలింగ్‌కు అనుమతులు
 రిమ్స్‌లో నర్సింగ్ కౌన్సెలింగ్‌కు అనుమతులు మంజూరైనట్లు డెరైక్టర్ అంజయ్య వెల్లడించారు. గుంటూరు నర్సింగ్ కళాశాలకు చెందిన సరోజినిని ఒంగోలు రిమ్స్ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా నియమించినట్లు తెలిపారు. రిమ్స్‌లో స్టాఫ్ నర్సులుగా పనిచేస్తున్న వారిలో 60 మంది ఎమ్మెస్సీ నర్సింగ్ పూర్తిచేసిన వారేనని పేర్కొన్నారు. వారందర్నీ రిమ్స్ నర్సింగ్ కళాశాలకు పంపిస్తామన్నారు. కళాశాలలో విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తున్నట్లు చెప్పారు. త్వరలో హాస్టల్ భవనాలను కూడా నిర్మించనున్నట్లు తెలిపారు. విలేకర్ల సమావేశంలో రిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాంప్రసాద్ పాల్గొన్నారు.
 గిరిజన విద్యార్థులు 
 
 దరఖాస్తు చేసుకోవాలి...
 రిమ్స్ నర్సింగ్ కళాశాలలో ప్రవేశానికి అర్హులైన గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని గిరిజన సంక్షేమశాఖ జిల్లా అధికారి ఎం.కమల ఒక ప్రకటనలో కోరారు. యానాది కులానికి చెందిన విద్యార్థినులకు 10, ఇతర గిరిజన విద్యార్థినులకు 15 సీట్ల చొప్పున కేటాయించినట్లు చెప్పారు. విద్యార్థులు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు/రేషన్‌కార్డు, సెల్‌నంబర్, పూర్తిచిరునామా రాసిన కవర్‌ను ‘ప్రాజెక్టు అధికారి, కొండాయపాలెం గేటు దగ్గర, ఎల్‌ఐసీ కార్యాలయం పక్కన, నెల్లూరు’ చిరునామాకు పంపాలని సూచించారు. అదే విధంగా ఞౌజ్టీఛ్చీటఃజఝ్చజీ.ఛిౌఝ ఈ-మెయిల్‌కు కూడా పంపవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఒంగోలులోని ప్రగతిభవన్‌లోగల గిరిజన సంక్షేమశాఖ కార్యాల యంలో సంప్రదించాలని సూచించారు.
 
మరిన్ని వార్తలు