రాష్ట్రంలో ఏడో స్థానం

24 Apr, 2015 03:04 IST|Sakshi
రాష్ట్రంలో ఏడో స్థానం

ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ కోర్సులలో మొత్తం 25,290 మంది హాజరుకాగా వారిలో 14,816 మంది ఉత్తీర్ణులయ్యారు. - జనరల్ కోర్సులలో 24,608 మంది హాజరుకాగా 14,649 మంది అంటే 60 శాతం ఉత్తీర్ణత సాధించారు.  ఇందులోనూ బాలికలదే పై చేయి.
ఒకేషనల్ కోర్సులలో మొత్తం 682 మంది హాజరుకాగా 367 మంది ఉత్తీర్ణులై 54 శాతంగా నిలిచారు.
ఉమ్మడి రాష్ట్రంలో 2013లో 53 శాతం, 2014లో 56 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో 8వ స్థానంలో నిలవగా ఈ ఏడాది 13 జిల్లాల పరిధిలో 7వ స్థానంలో నిలిచారు.

గత ఏడాదితో పోలిస్తే 4 శాతం ఉత్తీర్ణత పెరిగినా రాష్ట్రస్థాయిలో కేవలం ఒక్క స్థానానికి మాత్రమే జిల్లా ఎగబాకింది.
ఒకేషనల్‌లో రాష్ట్రస్థాయిలో 5వ స్థానంలో నిలిచింది.

 ఒంగోలు వన్‌టౌన్: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలలో బాలికలు పైచేయి సాధించారు. బాలురకంటే 12 శాతం అధిక ఉత్తీర్ణత సాధించి తమ సత్తా చాటారు. ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ కోర్సులలో మొత్తం 25,290 మంది హాజరుకాగా వారిలో 14,816 మంది ఉత్తీర్ణులయ్యారు. జనరల్ కోర్సులలో 24,608 మంది హాజరుకాగా 14,649 మంది అంటే 60 శాతం ఉత్తీర్ణత సాధించగా వీరిలో బాలికలు 11,722 మంది పరీక్షలు రాయగా 7,678 మంది ఉత్తీర్ణులై 66 శాతం నమోదు చేశారు.

బాలురు 12,886 మంది పరీక్షలు రాయగా 6,971 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలకంటే 12 శాతం తక్కువుగా 54 శాతం మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ కోర్సులలో మొత్తం 682 మంది హాజరుకాగా 367 మంది ఉత్తీర్ణులై 54 శాతంగా నిలిచారు. వీరిలో బాలురు 442 మంది పరీక్షరాయగా 211మంది, బాలికలు 240 మంది పరీక్షకు హాజరుకాగా 156 మంది పాసయ్యారు. బాలురకంటే 17 శాతం అధికంగా బాలికలు  ఉత్తీర్ణత సాధించి శెహభాష్ అనిపించారు.

రాష్ట్రస్థాయిలో 7వ స్థానంలో నిలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో 53 శాతం, 2014లో 56 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో 8వ స్థానంలో నిలవగా ఈ ఏడాది 13 జిల్లాల పరిధిలో 7వ స్థానంలో నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే 4 శాతం ఉత్తీర్ణత పెరిగినా రాష్ట్రస్థాయిలో కేవలం ఒక్క స్థానానికి మాత్రమే ఎగబాకారు. ఒకేషనల్‌లో రాష్ట్రస్థాయిలో 5వ స్థానం దక్కింది.
 
ప్రభుత్వ కళాశాలల్లో...
ప్రభుత్వ కళాశాలలు కూడా ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు సాధించాయి. జనరల్ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలవగా, ఒకేషనల్ విద్యార్థులు తృతీయ స్థానంలో నిలిచారు. జనరల్ కోర్సులలో మొత్తం 3018 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 1633 మంది 54 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ కళాశాలల్లో బాలికలు, బాలురకంటే 12శాతం అధికంగా పాసయ్యారు. బాలురు 1725 మంది పరీక్షలు రాయగా 845 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 1293 మంది పరీక్షలు రాయగా 788 మంది ఉత్తీర్ణత సాధించారు.

ఒకేషనల్ కోర్సులలో కూడా బాలురకంటే బాలికలు 10 శాతం అధిక ఉత్తీర్ణత సాధించారు. బాలురలో 254 మంది పరీక్షకు హాజరుకాగా 178 మంది పాసయ్యారు. బాలికల్లో 177 మంది పరీక్షలు రాయగా వారిలో 143 మంది ఉత్తీర్ణులయ్యారు.

జిల్లాలో ఎంఈసీలో ప్రథమ స్థానం
ఒంగోలులోని ఉమా మహేశ్వర కళాశాలలో చదివిన కె.సురేష్ రెడ్డి ఎంఈసీలో 500 మార్కులకుగాను 487 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానం సాధించారు. రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచారు.

మరిన్ని వార్తలు