భయం గుప్పిట్లో మన్యం

25 Jul, 2018 13:11 IST|Sakshi
కాకరపాడులో మంగళవరాం కారులో వస్తువులు తనిఖీ చేస్తున్న ఎస్‌ఐ రుక్మంగధరావు, సిబ్బంది

28 నుంచి మావోయిస్టుల వారోత్సవాలు

అధికార పార్టీ నేతలను అప్రమత్తం చేసిన పోలీసులు

మారుమూల ప్రాంతాల్లో కూంబింగ్‌ ఉధృతం

పదిరోజుల పాటు మన్యం భయం గుప్పెట్లోకి వెళ్లనుంది. ఈ నెల 28 నుంచి ఆగస్టు మూడు వరకు మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలను నిర్వహించనున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పట్నుంచే పోలీసులు చర్యలు చేపట్టారు. మన్యంలో 17 స్టేషన్ల పరిధిలోను రోజువారి తనిఖీలను ముమ్మరం చేశారు. మావోయిస్టుల హిట్‌ జాభితాలో ఉన్న వారికి, అధికార  పార్టీ నేతలను పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు  వారోత్సవాలు ముగిసే వరకు మన్యం విడిచి వెళ్లాలని సూచనలు చేస్తున్నారు.

విశాఖపట్నం ,కొయ్యూరు : ప్రతియేటా మావోయిస్టులు నిర్వహిస్తున్న సాయుధపోరాటంలో  మరణించిన వారి పెరిట  స్లూపాలను నిర్మానం చేసి నివాళులు అర్పి స్తారు. స్తూపాలపై మరణించిన వారి పేర్లను రా స్తారు. వాటిని నివారించేందుకు పోలీసులు కూం బింగ్‌ను ఉధృతం చేశారు.ఇటీవల కాలంలో  మిలి షీయా సభ్యుల లొంగుబాట్లు, అరెస్టులు ఎక్కువయ్యాయి. అయినా మావోయిస్టులు చాపకింద నీరులా వారి కార్యకలాపాలను కొన్ని చోట్ల నిర్వహిస్తున్నారు.

గూడెం, కొయ్యూరు, చింతపల్లిలో కొంత భాగాన్ని పర్యవేక్షణ చేసే గాలికొండ ఏరియా కమిటీకి నవీన్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఇక  చింతపల్లి, జీ మాడుగులలో తిరిగే కోరుకొం డ  ఏరియా  కమిటీని పెదబయలు కమిటీలో విలీ నం చేసినట్టుగా తెలుస్తుంది. మావోయిస్టులు సం చరించే ప్రాంతాలపై పోలీసులు నిఘా ఉంచారు. కూంబింగ్‌ను ఉధృతం చేశారు. ఆగస్టు మూడుతో వారోత్సవాలు ముగిసేంత వరకు పోలీసుల కూం బింగ్‌ కొనసాగనుంది. స్థానికంగా మావోయిస్టులు కొంత వరకు బలహీన పడినా బయట ప్రాం తాల నుంచి విద్వంసాలు చేసే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిలో భాగంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కీలక ప్రాం తాల్లో వాహనాల తనిఖీని ముమ్మరం చేశారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు