పాలిటెక్నిక్‌లలోనూ ‘టాస్క్‌ఫోర్స్’తనిఖీలు!

28 Sep, 2014 00:41 IST|Sakshi
పాలిటెక్నిక్‌లలోనూ ‘టాస్క్‌ఫోర్స్’తనిఖీలు!

174 ఇంజనీరింగ్ కాలేజీల్లో నడుస్తున్న
పాలిటెక్నిక్‌లపై దృష్టి
బోధన సిబ్బంది, వలిక వసతులపై పరిశీలన
హడలిపోతున్న ప్రైవేటు యాజమాన్యాలు

 
హైదరాబాద్: ఇక పాలిటెక్నిక్‌ల పరిస్థితిపై తెలంగాణ సాం కేతిక విద్యాశాఖ దృష్టి సారించింది. ప్రత్యేక ‘టాస్క్‌ఫోర్స్’ను ఏర్పాటు చేసి, అన్ని ప్రైవేటు పాలిటెక్నిక్ లను తనిఖీ చేయాలని అధికారులు యోచిస్తున్నారు. లోపాలున్నాయన్న కారణంతో ఈ ఏడాది 174 ఇంజనీరింగ్ కళాశాలలకు జేఎన్టీయూహెచ్ అఫిలియేషన్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. జేఎన్టీయూహెచ్ అధికారులు ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే.. తమ కళాశాలల్లోని పాలిటెక్నిక్‌లలో ‘టాస్క్‌ఫోర్స్’ తనిఖీలకు రానుందని తెలిసి ప్రైవేటు యాజమాన్యాలు హడలిపోతున్నాయి.

బోధనా సిబ్బందే కీలకం: రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 467 పాలిటెక్నిక్‌లు ఉండగా, వీటిలో 239 పాలిటెక్నిక్‌లు ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో షిప్టు పద్ధతిన నడుస్తున్నాయి.  అన్ని ఇంజనీరింగ్ కళాశాలలకు ఏఐసీటీఈ అనుమతులున్నప్పటికీ, విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా బోధనా సిబ్బంది లేకపోవడమే పెద్దలోపంగా అధికారులు భావిస్తున్నారు. 174 కళాశాలల్లో బోధనా సిబ్బంది కొరత ఉన్నట్లు జేఎన్టీయూహెచ్ గుర్తించి అఫిలియేషన్ నిలిపి వేయడంతో.. వాటిలో నడుస్తున్న పాలిటెక్నిక్‌ల తనిఖీలకు సాంకేతిక విద్యాశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు.

పరిశీలన అవసరమే:వెంకటేశ్వర్లు, ఎస్‌బీటీఈటీ కార్యదర్శి

 పాలిటెక్నిక్‌లకు అఫిలియేషన్ ఇచ్చే సమయంలో ఆయా సంస ్థల్లో వసతులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తాం. ఇంజనీరింగ్ కళాశాలకు ఉండాల్సిన వసతుల్లో సగం ఉన్నా పాలిటెక్నిక్  నిర్వహణకు సరి పోతుంది. అఫిలియేషన్ ఇచ్చే సమయంలో చిన్నచిన్న లోపాలున్నట్లు అధికారులు గుర్తిస్తే, సవరించుకుంటామని యాజమాన్యాల నుంచి హామీ తీసుకుంటాం. ఇటీవల లోపాలున్నాయం టూ కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలకు జేఎన్టీయూహెచ్ అఫిలియేషన్ నిలిపి వేయడంతో,  వాటిలో నిర్వహిస్తున్న పాలిటెక్నిక్‌లను పరిశీలించాల్సిన అవసరమైతే ఉంది. దీనిపై సాంకేతిక విద్యా కమిషనర్ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.        
 
 

మరిన్ని వార్తలు