దాతలు ఆదుకోవాలని వినతి

31 Jan, 2019 08:14 IST|Sakshi
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హిందీ మాస్టారు సత్యనారాయణ

తూర్పుగోదావరి, అముజూరు (కె.గంగవరం): అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆ కుటంబం విషాదంలోకి వెళ్లింది. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన పాము వీర వెంకట సత్యనారాయణ(40) హిందీ మాస్టారుగా రామచంద్రపురం పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్లో పనిచేస్తున్నారు. ఆయనకు వచ్చే జీతంతో భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఇప్పటి వరకు కడిపారు. హిందీ మాస్టారుగా ఎంతో మంది విద్యార్థులను హిందీ భాషలో ప్రావీణ్యులను చేశారు. నెల రోజుల క్రితం సత్యనారాయణ అనార్యోగానికి గురైతే కుటుంబ సభ్యులు కాకినాడ ఆసుపత్రికి తరలించారు. వారు పరీక్షలు చేసి రెండు కిడ్నీలు పాడైపోయాయని చెప్పడంతో ఒక్కసారిగా వారి పరిస్థితి తల్లకిందులైంది.

ఆయన చెల్లి కిడ్నీని దానం చేయడంతో కాకినాడలోని ట్రస్టు ఆసుపత్రిలో ఆరోగ్య శ్రీ ద్వారా రూ.ఐదు లక్షలతో ఆపరేషన్‌ ఇటీవల చేయించారు. ఆపరేషన్‌ అనంతరం చేయాల్సిన చికిత్స కొనసాగాలంటే మరో రూ.మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఖర్చవుతుందని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. కూలిపనులు చేసుకునే తాము ఇంత డబ్బు తేలేక, ఆరోగ్య బాగుంటే చాలని వారు ఆవేదన చెందుతున్నారు. ఉన్నదంతా పోగేసి ఆపరేషన్‌ చేయించామని, మిగతా చికిత్స కోసం కావల్సిన సొమ్ములు ఎలా అని వారు సతమతమవుతున్నారు. దాతలు సాయం చేస్తే చికిత్స చేయడానికి వీలుగా ఉంటుందని దాతలు ఎవరైనా సాయం చేయాలని వారు కోరుతున్నారు.  సాయం అందించాల్సిన దాతలు ఆంధ్రాబ్యాంకు అకౌంట్‌ నంబర్‌ 044010100135297, ఐఎఫ్‌సీ కోడ్‌ ఏఎన్‌డీబీ0000440 నంబర్‌కు సాయం అందించాలని వారు కోరుతున్నారు. నేరుగా సాయం అందించాలనే దాతలు సెల్‌: 98485 42811కు సంప్రదించాలని వారు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు