లాక్‌డౌన్‌లోనూ మద్యం అమ్మకాలా..

7 Apr, 2020 13:10 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఫైర్‌

ప్రొద్దుటూరు: పట్టణంలో కొందరు బార్ల యజమానుల తీరుపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వారు మద్యం అమ్మకాలెలా జరుపుతున్నారని ఎక్సై జ్‌ అధికారులను ఆయన  ప్రశ్నించారు. మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం ఎక్సైజ్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాచమల్లు మాట్లాడు తూ నష్టం వస్తున్నా ప్రజల ఆరోగ్యం కోసం ప్రభు త్వం మద్యం అమ్మకాలను నిలిపివేసిందన్నారు. కానీ కొంత మంది ధరలు దారుణంగా పెంచి అమ్ముకుంటున్నారన్నారు. తన వద్ద రుజువులు ఉన్నాయన్నారు. ఓ బార్‌ యజమాని లాక్‌డౌన్‌ సమయంలో  రూ.10లక్షలు ఆర్జించినట్లు తెలిసిందన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అమ్మకాలు సాగుతున్నా పట్టించుకోవడం దారుణమన్నా రు. కోగటంలో మద్యం తయారు చేసి సరఫరా చేస్తున్నారని తెలిపారు. రామేశ్వరంలో రోజూ సాయంత్రం గుంపులుగుంపులుగా చేరుతున్నారన్నారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో నిరోధించకపోతే ప్రభుత్వానికి నేరుగా ఫిర్యాదు చేస్తానని అధికారులను ఎమ్మెల్యే హెచ్చరించారు. సమావేశంలో అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ రాధాకృష్ణ, సీఐ సీతారామిరెడ్డి పాల్గొన్నారు.

మున్సిపాల్‌ పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చేతుల మీదుగా శానిటైజర్లను పంపిణీ చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ రాధ, అసిస్టెంట్‌ కమిషనర్‌ గంగాప్రసాద్, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ, వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి పాల్గొన్నారు.
19వ వార్డులో వైఎస్సార్‌సీపీ నాయకుడు మునీర్, అమీర్‌ 1000 మందికి కూరగాయలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు పాతకోట బంగారు మునిరెడ్డి, చాంద్‌బాషా, జగన్, ప్రసాద్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు