రానున్న 24 గంటలలో జల్లులు

8 Aug, 2014 02:24 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఒడిశా నుంచి దక్షిణ కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణలో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం బలహీనపడి అల్పపీడ నంగా మారి ప్రస్తుతం మధ్యప్రదేశ్, రాజస్థాన్ మధ్య కొనసాగుతోంది. దీనిప్రభావం మరింత క్షీణించనున్నట్టు వాతావరణ నిఫుణులు తెలిపారు. 

మరో రెండు రోజుల్లో వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయన్నారు. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉందన్నారు. దీని ప్రభావం మరో రెండు రోజుల్లో కనిపించే అవకాశాలున్నట్టు తెలిపారు. గురువారం ఉదయానికి తెలంగాణలోని లక్సెట్టిపేటలో గరిష్టంగా 3 సెం.మీ., భద్రాచలం, డోర్నకల్, మహబూబాబాద్‌లో 2 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ శాఖ తన నివేదికలో వెల్లడించింది.
 

మరిన్ని వార్తలు