అనుబంధాలకు రక్తపువురకలు!

24 Dec, 2013 04:02 IST|Sakshi
అనుబంధాలకు రక్తపువురకలు!

 =ఏడాదిలో జిల్లాలో 65 హత్యలు
 =ఇందులో సగం రక్తసంబంధికులవే...
 =క్షణికావేశంలోనే అనర్థాలు

 
పేగు పంచుకుని పుట్టిన తల్లిని ఒకరు....వేలు పట్టుకుని నడిపించిన నాన్నను వురొకరు....అవ్మూనాన్నలను ఒకేసారి చంపిన కొడుకు...పెళ్లి చేసుకుని నిండు నూరేళ్లు ఒకరికొకరు తోడు నీడగా ఉండాల్సిన వారు బంధాన్ని వురిచిపోరుు అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 65 హత్యలు చోటు చేసుకోగా... అందులో సగం వరకు పేగు బంధం పంచుకున్న వారివే. నర్సంపేట డివిజన్‌లో ఏడాదిలోనే ఎనిమిది సంఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం.
 
నర్సంపేట, న్యూస్‌లైన్ : రక్తసంబంధీకుల మధ్య బంధాలు తెగిపోతున్నారుు. క్షణికావేశంలో అనర్థాలు చోటుచేసుకుంటున్న ఘటనలు జిల్లాలో విపరీతంగా పెరిగిపోయూరుు. భార్యను భర్త చం పడం...  భర్తను భార్య చంపడం వంటి ఘా తుకాలు కొనసాగుతూ అనుబంధానికి విఘా తం కలిగిస్తున్నారుు. ఈ క్రమంలో పేగు బం ధం సైతం మరిచి ఉన్నాదిలా వ్యవహరిస్తున్నారు. తాజాగా ముగ్ధంపురంలో జరిగిన ఘ టనజిల్లావాసులను కలవరానికి గురిచేసింది.  
 
 అనుబంధాల వుధ్య జరిగిన హత్యల వివరాలు...
 చెన్నారావుపేట వుండల కేంద్రానికి చెందిన కోరె సవ్ముయ్యు అనే వ్యక్తిని అతడి కువూరు డు కువూరస్వామి పారతో కొట్టి చంపాడనే నెపంతో జైలు జీవితం గడుపుతున్నాడు. ఇదే వుండలం కోనాపురం గ్రావూనికి చెంది న గనపాకరవి అనే వ్యక్తిని 2012లో అతడి తం డ్రి రాంబాబు కత్తితో పొడిచి హత్య చేశాడు.
     
 ఇదే వుండలం పాతవుుగ్దుంపురం గ్రావూనికి చెందిన అన్న లింగయ్యు అనే వ్యక్తిని ఆస్తి తగాదా విషయుంలో అతడి భార్య అన్న కట్టవ్ము కూర్చునే పీటతో హత్య చేసి జైలులో ఉంది.
     
 నల్లబెల్లి వుండలానికి చెందిన కోర్నేని అవుృతవ్ము ఒంటిపై ఉన్న నగలను దోచుకునేందుకు ఆమె వునువడే హత్య చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
     
 దుగ్గొండి వుండలం గిర్నిబావికి చెందిన గిన్నె సునీత అనే వుహిళను ఆమె భర్త ప్రభాకర్ గొడ్డలితో నరికి చంపినట్లు కేసు నమోదు కాగా..  వారి పిల్లలు తల్లిలేని వారయ్యూరు.
 

మరిన్ని వార్తలు