కొనసాగుతున్న‘ఎర్ర’దొంగల వేట

29 May, 2014 04:41 IST|Sakshi
కొనసాగుతున్న‘ఎర్ర’దొంగల వేట

 
 సాక్షి, చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్ల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. అటవీ శాఖ అధికారుల తో కలిసి అన్ని వైపుల నుంచి పట్టుబిగిస్తున్నా రు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై కఠినంగా వ్యవహరించాలని పోలీసు బాస్ నుంచి ఉత్తర్వులు రా వడంతో రాయలసీమ జోన్ ఐజీ నవీన్‌చంద్, అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ పర్యవేక్షణలో టాస్క్‌ఫోర్స్‌తోపాటు పోలీసు సర్కిల్స్ పరిధిలోని సీఐలతో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు.

 తిరుపతి అర్బన్, చిత్తూరు, వైఎస్సార్ జిల్లా పోలీసులు ఈ వ్యవహారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రేణిగుంట, మదనపల్లె సబ్ డివిజన్ల పరిధిలోని వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు చెందిన ఇద్దరు కీలక స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి ని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. వైఎస్సా ర్ జిల్లాలోని శేషన్ అనే ఎర్రచందనం స్మగ్లర్ ఇంటిపై రేణిగుంట పోలీసులు దాడులు నిర్వహించి లక్షల్లో సొమ్ము స్వాధీనం చేసుకున్నారు.

సీక్రెట్ ఆపరేషన్
టాస్క్‌ఫోర్స్ వద్దనున్న సమాచారంతో తిరుపతి అర్బన్, చిత్తూరు జిల్లా పోలీసులు కూడా ఎర్రదొంగలవేటలో పడ్డారు. చిత్తూరు జిల్లా పోలీసు నుంచి ఏడుగురు సీఐలను రహస్య ఆపరేషన్ కోసం రంగంలోకి దించారు. వీరు ఈ పనిలోనే ఉన్నట్లు పోలీసు డిపార్టుమెంట్‌లోని కిందిస్థా యి సిబ్బందికి కూడా తెలియదు. ఎర్రచందనం ్మగ్లింగ్ దర్యాపునకు సంబంధించి శాఖాపరమైన సమాచారం బయటకు పొక్కకుండా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమిళనాడు, కర్ణాటకల్లోని పెద్దస్థాయి స్మగ్లర్లు,  జిల్లాలోని రెండో శ్రేణి స్మగ్లర్లు, మధ్యవర్తులు, రవాణా సౌకర్యాలు సమకూరుస్తున్న, కూలీలను ఏర్పాటు చేస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నారు.

రహస్య విచారణ
ఎర్రచందనం స్మగ్లింగ్‌లో అరెస్టుల సమాచారాన్ని వెంటనే వెల్లడించకుండా వారి నుంచి వివరాలు రాబట్టేందుకు రహస్య ప్రదేశంలో విచారణ జరుపుతున్నారు. ఇందుకోసం టాస్క్‌ఫోర్స్ అధికారులతోపాటు రేణిగుంట, తిరుపతి సబ్ డివిజన్‌లోని కొందరు అనుభవమున్న పోలీసు అధికారులను ఉపయోగిస్తున్నారు. అటవీ శాఖతో సంబంధం లేకుండా పోలీసులు తమకున్న సమాచారం మేరకు పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్ల జాబితా తయారు చేసి ప్రభుత్వానికి పంపనున్నారు.

చిత్తూరు జిల్లా సరిహద్దు వైఎస్సార్ జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఎర్రచందనం స్మగ్లర్లలో ఇద్దరు ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం నిధులు మంచి నీళ్లలా ఖర్చుచేశారు. వీరిలో ఒకరు ఏకంగా ఎన్నికల సభలో చంద్రబాబు పక్కన కూర్చుని ఉండగా పత్రికల్లో ఫొటో ప్రచురితం కావడం గమనార్హం. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో ఉన్న స్మగ్లర్లను పోలీసులు ఏం చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది

మరిన్ని వార్తలు