దిగజారిన ధాన్యం ధరలు

24 Aug, 2013 03:21 IST|Sakshi

కొడవలూరు, న్యూస్‌లైన్ : ఎడగారు సీజ న్‌లో వరి సాగు చేసిన రైతులు ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లభించకపోవడం తో ఆందోళన చెందుతున్నారు. మండలంలో సుమారు 2 వేల ఎకరాల్లో ఎడగారు వరి సాగు చేపట్టారు. ఈ దఫా కా లువల ద్వారా సాగునీటిని విడుదల చే యకపోవడంతో రైతులు మోటార్లు, ఆ యిల్ ఇంజన్లు ఉపయోగించి అష్టకష్టాలు పడి వరి సాగు చేశారు. గత సీజన్‌లో ఆ శించిన మేర దిగుబడులు రావడం, ధా న్యం ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు వ రి సాగుపై మక్కువ చూపారు. ప్రస్తుత సీజన్‌లో ధాన్యం ధరలు దిగజారడంతో పెట్టుబడులు కూడా వచ్చే ప రిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు.
 
 దీనికి తోడు వాతావరణంలో మార్పులు కారణంగా ధాన్యం దిగుబ డులు తగ్గాయి. వ్యవసాయ ఖర్చులు తడిసి మోపడయ్యాయి. ఎకరాకు సుమారుగా రూ.15 నుంచి 18 వేలు ఖర్చయ్యా యి. ఈ సీజన్‌లో రైతులు నెల్లూరు జిల కర వరి రకాన్ని ఎక్కువగా సాగు చేశారు. ఎకరాకు రెండు పుట్లుకు మించి ధాన్యం దిగుబడి రావడం లేదు. గత సీజన్‌లో అయితే ఎకరాకుల నాలుగు పుట్లుకు మించి దిగుబడి లభించింది.ప్రస్తుతం పుట్టి ధాన్యం ధర రూ.10,500 పలుకుతోంది. గత సీజన్‌లో పుట్టి ధాన్యం రూ.13 వేల వరకు వ్యాపారస్తులు కొనుగోలు చేశారు. ఎడగారులో దిగుబడి తగ్గి.. ధర తగ్గడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
 
 వాతావరణ మార్పులతో ఆందోళన
 వరికోత యంత్రాల ద్వారా కోసిన ధాన్యాన్ని నిల్వ ఉంచుకునే పరిస్థితి లేకపోవడంతో రైతులు అయినకాడికి తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వాతావరణంలో మార్పులు కారణంగా మబ్బులు ఏర్పడి అకాల వర్షాలు కురుస్తుండడంతో ధాన్యాన్ని ఆర బెట్టుకునే అవకాశం లేకపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
 

>
మరిన్ని వార్తలు