రన్ బాలయ్య..ఉత్సవాల సందడయ్యా

26 Feb, 2016 02:42 IST|Sakshi
రన్ బాలయ్య..ఉత్సవాల సందడయ్యా

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరి దృష్టి ఈ నెల 27, 28న లేపాక్షిలో నిర్వహించనున్న నంది ఉత్సవాలపైనే ఉందని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం హిందూపురంలో చేపట్టిన 5కేరన్‌లో విద్యార్థులతో కలసి ఆయన పాల్గొన్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ లేపాక్షి ఉత్సవాలను అందరూ అబ్బురపోయేలా నిర్వహిస్తామన్నారు. ఆలయ చరిత్ర, శిల్పకళ, చిత్రలేఖనం గురించి ప్రపంచానికి చాటిచెబుతామని పేర్కొన్నారు. ఉత్సవాలకు సీఎం చంద్రబాబును ఆహ్వానించామని, రావడానికి ఆయన సుముఖం వ్యక్తం చేశారని చెప్పారు. శుక్రవారం లేపాక్షిలో హెరిటేజ్ వాక్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. - హిందూపురం

మరిన్ని వార్తలు