కొనుగోల్‌మాల్!

17 Feb, 2014 00:07 IST|Sakshi
కొనుగోల్‌మాల్!

 కొనుగోల్‌మాల్!
 గజ్వేల్,:
 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లాలో 1.25 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగైంది. నవంబర్ నెల మూడో వారంలో వారం రోజుల పాటు తుపాన్ ధాటికి ఈ పంటకు అపార నష్టం వాటిల్లింది. నష్టాన్ని మినహాయిస్తే జిల్లావ్యాప్తంగా రైతులవద్ద సుమారు 60 లక్షల క్వింటాళ్లకుపైగా మొక్కజొన్న ఉత్పత్తులు వచ్చాయి. గజ్వేల్ ప్రాంతంలో నూర్పిళ్లు జరగకుండా మొక్కజొన్న జూళ్లు చేలల్లోనే వున్నాయి. ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా అక్టోబర్ నెలలో జిల్లాలో 14 ఐకేపీ కేంద్రాలను తెరిచింది. ఈ కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.1,310 చెల్లించి ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. ఐకేపీ కేంద్రాల ద్వారా సుమారు 5లక్షల క్వింటాళ్లు మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. నిజానికి రైతులు పండించిన ఉత్పత్తుల్లో ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేసింది 10 శాతం కూడా మించలేదంటే అతిశయోక్తి కాదు. గజ్వేల్‌లో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో 28 వేల కింటాళ్లకుపైగా మక్కలను కొనుగోలు చేశారు. ఇందులో 14 వేల క్వింటాళ్లకుగాపైగా నిల్వలను మార్క్‌ఫెడ్ గోదాముల్లోకి తరలించి సుమారు రూ.1.85 కోట్ల చెల్లింపులు జరిపారు. మరో 14 వేల క్వింటాళ్ల నిల్వలు ప్రస్తుతం యార్డులో తరలింపునకు నోచుకోకుండా ఉన్నాయి. వీటిని 50 రోజుల క్రితమే కొనుగోలు చేశారు.

మరిన్ని వార్తలు