సమైక్యాంధ్ర పోరులో వైఎస్సార్ సీపీ ముందంజ

2 Oct, 2013 01:59 IST|Sakshi
 జగ్గయ్యపేట, న్యూస్‌లైన్ :రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ధ్యేయంతోనే వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌లో సమైక్య శంఖారావం సభను నిర్వహిస్తామని ధైర్యంగా ప్రకటించారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను చెప్పారు. బస్టాండ్ ఆవరణలో మంగళవారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో ఏ రాజకీయ పార్టీ నాయకులకు కూడా బహిరంగసభ నిర్వహించడానికి  ధైర్యం సరిపోలేదన్నారు. అటు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, ఇటు టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా తెలంగాణ ప్రాంతంలో మొక్కవోని దీక్షతో సమైక్య శంఖారావం కార్యక్రమాన్ని తలపెట్టడం జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమైందన్నారు. 
 
 చంద్రబాబు రాష్ట్ర విభజన లేఖను ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తమ పార్టీ నేతలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో  నిరశన దీక్షలు చేపడుతున్నారని తెలిపారు.  సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ముందుండి పోరాడుతోందన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తన్నీరు నాగేశ్వరరావు, పట్టణ పార్టీ కన్వీనర్ షేక్ మదార్‌సాహెబ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ముత్యాల వెంకటాచలం, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు జె.ఉదయభాస్కర్, చింకా వీరాంజనేయులు,  జగదీష్  తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు