ఇది దేవుడిచ్చిన తీర్పు: సత్యంబాబు

3 Apr, 2017 03:35 IST|Sakshi
ఇది దేవుడిచ్చిన తీర్పు: సత్యంబాబు

రాజమహేంద్రవరం క్రైం/విజయవాడ: ‘‘ఇది దేవుడిచ్చిన తీర్పు. తొమ్మిదేళ్ల నిరీక్షణ ఫలితంగా న్యాయమే గెలిచిం ది’’ అని పిడతల సత్యంబాబు అన్నాడు. ఆయేషామీరా హత్యకేసులో నిర్దోషిగా తేలిన సత్యంబాబు రాజమ హేంద్రవరం సెంట్రల్‌ జైలునుంచి ఉద్విగ్న పరిస్థితుల మధ్య ఆదివారం ఉదయం విడుదల య్యాడు. సత్యంబాబును నిర్దోషిగా పేర్కొంటూ హైకోర్టు శుక్రవారమే తీర్పు ఇచ్చినప్పటికీ, సంబంధిత ఉత్తర్వులు జైలు అధికారులకు అందడంలో తీవ్రజాప్యం చోటు చేసుకుంది.

 మాల సంక్షేమ సంఘం ఉద్యోగుల విభాగం నాయకుడు చెట్లపల్లి అరుణ్‌కుమార్‌ కోర్టు ఉత్తర్వులను హైదరాబాద్‌ నుంచి ఓ ప్రైవేటు బస్సులో ఆదివారం ఉదయం 8.05 గంటలకు రాజమహేంద్రవరం తీసుకొచ్చారు. ఉత్తర్వులను జైళ్లశాఖ డీఐజీ చంద్రశేఖర్‌ పరిశీలించి, ఉదయం 8.15 గంటలకు జైలు అధికారులకు అందజేశారు. అన్ని లాంఛ నాలూ పూర్తయ్యాక సత్యంబాబును జైలు నుంచి విడుదల చేశారు. అనంతరం సత్యం బాబు మాట్లాడుతూ తల్లి రుణం తీర్చుకుంటానని, చెల్లెలికి వివాహం చేయాల్సి ఉందని తెలిపాడు. తాను జైలుపాలవడంతో తన కుటుంబం దుర్భర పరిస్థితులను ఎదుర్కొందని ఆవేదన చెందాడు. కుమార్తెను పోగొట్టుకున్న ఆయేషా మీరా తల్లిదండ్రులకు కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని కోరాడు.

మరిన్ని వార్తలు