బంద్ తో స్తంభించిన సీమాంధ్ర

12 Jul, 2013 15:20 IST|Sakshi
సీమాంధ్రలో బంద్, ఆందోళనలు

సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో నేడు బంద్ కొనసాగుతోంది. సీమాంధ్ర జిల్లాల్లో అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో బంద్ జరుగుతోంది. వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, కార్యాలయాలు మూతపడడంతో జనజీవనం స్తంభించింది. కొన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను ఆందోళనకారులు అడ్డుకున్నారు.
 
**కర్నూలు నంద్యాలలో సమైక్యాంధ్రకు మద్దతుగా న్యాయవాదులు విధులు బహిష్కరించారు
**చిత్తూరులో విద్యాసంస్థలు, ఆర్టీసీ బస్సులు బంద్‌  
**తిరుపతిలో ఎస్వీ యూనివర్సిటీలో విధులు బహిష్కరించిన ప్రొఫెసర్లు, విద్యార్ధులతో కలిసి భారీ ర్యాలీ
**గుంటూరు జిల్లాలో తెరుచుకోని విద్యా, వ్యాపార సంస్థలు
**విజయవాడలో వ్యాపార, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేత, విద్యార్ధి జేఏసీ ర్యాలీ
 
**తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో విద్యా, వ్యాపార సంస్థల బంద్,  పిఠాపురంలో జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో
**పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో మానవహారం, బంద్
**విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్శిటీలో తరగతులు బహిష్కరించిన విద్యార్థులు
**శ్రీకాకుళం జిల్లా అరసవల్లి జంక్షన్‌ నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు విద్యార్ధుల ర్యాలీ

మరిన్ని వార్తలు