అమెరికాను ఇక్కడే చూపిస్తాం...

8 Jan, 2016 00:47 IST|Sakshi
అమెరికాను ఇక్కడే చూపిస్తాం...

సీఆర్‌డీఏ డీసీ రఘునాథరెడ్డి

రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు కౌలు రూపంలో ఏడాదికి రూ.50 వేలు చొప్పున చెల్లిస్తున్నామని, రైతులు రాజధానికి మరింతగా సహకరిస్తే అమెరికాను ఇక్కడే చూపిస్తామని సీఆర్‌డీఏ డిప్యూటీ కలెక్టర్ జి. రఘునాథరెడ్డి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. భూములు లేని మూడు వేలకు పైగా రైతులకు, రైతు కూలీలకు నెలనెలా రూ.2,500 పింఛన్లు చెల్లిస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ తప్పకుండా పింఛను అందేలా కృషి చేస్తానన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం గ్రామం నుంచి 160 మీటర్ల వెడల్పున రెండు ఎక్స్‌ప్రెస్ రహదారులు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. అయితే ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తరువాత మాత్రమే ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఒక వేళ ఇళ్లను తొలగించాల్సి వస్తే మెరుగైన ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ పచ్చల రత్నకుమారి, జెడ్పీటీసీ ఆకుల జయసత్య, ఎంపీటీసీ సభ్యులు మొగిలి లీలావతి, షేక్ హన్నన్, మార్కెట్ చైర్మన్ ఆరుద్ర భూలక్ష్మి, వైస్ చైర్మన్ మన్నెం రమేష్, మండల ప్రత్యేకాధికారి ఎంజే నిర్మల, డెరైక్టర్ ల్యాండ్స్ బి. చెన్నకేశవులు, తహశీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో పద్మావతి, ఈవోఆర్డీ రవికుమార్‌లతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు