'రాజధాని నిర్మాణానికి సింగపూర్ సహాయం'

17 Jun, 2014 11:39 IST|Sakshi
'రాజధాని నిర్మాణానికి సింగపూర్ సహాయం'

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సింగపూర్ సహాయం తీసుకుంటామని ఆ రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ క్యాపిటెల్ నిర్మాణంలో భాగస్వాములు కావడానికి సింగపూర్ ముందుకు వచ్చిందని ఆయన వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లో మంత్రి నారాయణ సింగపూర్ ప్రభుత్వ ఆధికారులతో భేటీ అయ్యారు.

 

అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో అన్ని వసతులు ఒకే చోట ఉండేలా నిర్మాణం చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం నగరాలను మెగాసిటీలుగా అభివృద్ధి చేస్తామని నారాయణ వెల్లడించారు.

మరిన్ని వార్తలు