రాష్ట్రానికి, రాజ్యాంగానికి సంబంధం లేకుండా విభజన'

18 Jan, 2014 10:32 IST|Sakshi
రాష్ట్రానికి, రాజ్యాంగానికి సంబంధం లేకుండా విభజన'

రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ఉమ్మడి రాజధాని చేస్తారని శైలజానాధ్ కేంద్రాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీలో శనివారం బిల్లుపై జరిగిన చర్చలో శైలజానాథ్ ప్రసంగిస్తూ... ఇరుప్రాంతాలలో రాజకీయ లబ్ధి కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆరోపించారు. విభజన విషయాన్ని రాజకీయ పార్టీలు తేలిగ్గా తీసుకున్నందు వల్లే  ఇప్పుడు ఈ సమస్య  జఠిలమైందని అన్నారు.

 

తాను సమైక్య రాష్ట్రానికే కట్టుబడి ఉన్నానని శైలజానాథ్ పునరుద్ఘాటించారు. హైదరాబాద్పై రిఫరెండం పెడదామని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గతంలో వ్యాఖ్యలు చేశారని కానీ ఎప్పటిలానే కేసీఆర్ మాటా మార్చారని ఈ సందర్బంగా శైలజానాథ్ గుర్తు చేశారు. విభజన బిల్లును చూస్తుంటే మన రాష్ట్రానికి, రాజ్యాంగానికి సంబంధం లేనట్లుగా అనిపిస్తోందని శైలజానాథ్ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు