నేవీ స్థావరంలోకి అగంతకులు?

16 Dec, 2016 00:44 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని తూర్పు నావికాదళం ప్రధాన కేంద్రంలోకి ఇద్దరు అగంతకులు ప్రవేశించారన్న ప్రచారం కలకలం రేపుతోంది. నౌకాదళ స్థావరంలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారని సీసీ టీవీ ఫుటేజీల్లో రికార్డరుునట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న నిఘా వర్గాలు  అప్రమత్తమయ్యారుు. వీరు నావికాదళం ప్రధాన కేంద్రంలోకి గోడ దూకి ప్రవేశిం చినట్టు అనుమానిస్తున్నారు. వారు ఆయుధాలు కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు. వీరి ఆచూకీని కనుగొనేందుకు నావికాదళ స్థావరంలో అణువణువూ గాలిస్తున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో గగన తల మార్గంలోనూ అన్వేషిస్తున్నారు.

సోమవారం మధ్యాహ్నం నుంచే నేవీ ఉద్యోగులను, సివిల్ ఉద్యోగులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. విశాఖ తూర్పు నావికాదళ స్థావరంలో సుమారు వెరుు్య మందికి పైగా సివిల్ ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బంది, ఇతరులు నిత్యం వెళ్లి వస్తుంటారు. వీరితోపాటు వేల సంఖ్యలో నావికులు, నేవీ అధికారులు విధులు నిర్వహిస్తుంటారు. రేరుుంబవళ్లు సాయుధులైన నావికులు గస్తీ విధుల్లో ఉంటారు. వీరందరి కళ్లు గప్పి అగంతకులెలా ప్రవేశించారన్నది ప్రశ్నార్థకం గా మారింది. అగంతకులు నావికాదళ ప్రధాన స్థావరానికి ఆవల ఉన్న యారాడ కొండవైపు వెళ్లిపోయే అవకాశం ఉంది. దీంతో ఆ ప్రాంతంతోపాటు వారు తప్పించుకునేందుకు అవకాశాలున్న అన్ని మార్గాల్లోనూ నేవీ, పోలీసు, నిఘా వర్గాలు గాలిస్తున్నారుు. అరుుతే చొరబాటు వార్తలపై ఉన్నతాధికారులు నోరు మెదపడం లేదు.

మరిన్ని వార్తలు