సంద్రంలో సింబెక్స్‌ సంబరం

21 Nov, 2018 09:35 IST|Sakshi
సాగర జలాల్లో యుద్ధ విన్యాసాలు

సత్తా చాటుతున్నఇండో–సింగపూర్‌ సంయుక్త విన్యాసాలు

పాల్గొన్న ఇరుదేశాల రక్షణ మంత్రులు

పాతికేళ్ల ద్వైపాక్షిక బంధానికిప్రతీకగా సింబెక్స్‌–2018పేరుతో భారత్, సింగపూర్‌దేశాల నావికాదళాలు విశాఖతీరంలో నిర్వహిస్తున్న విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి.రెండో రోజు మంగళవారంనాటి కార్యక్రమాల్లో ఇరుదేశాల రక్షణ మంత్రులు పాల్గొన్నారు. ఇరుదేశాల మధ్యమైత్రీబంధాన్ని సాంకేతికరంగానికి కూడా విస్తరిస్తామని వారు ప్రకటించారు.విన్యాసాలు బుధవారంకూడా కొనసాగనున్నాయి.

విశాఖసిటీ: భారత్‌– సింగపూర్‌ దేశాల మధ్య సింబెక్స్‌ సైనిక విన్యాసాలు విశాఖ తీరంలో అట్టహాసంగా కొనసాగుతున్నాయి. రెండో రోజైన మంగళవారం తీరంలో భారత్, సింగపూర్‌ యుద్ధ నౌకలు, హెలికాప్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, జలాంతర్గాములు సందడి చేశాయి. సింగపూర్‌ రక్షణ శాఖ మంత్రి డాక్టర్‌ ఎన్‌ఎం ఇంగ్‌ హెన్, భారత నౌకాదళ ప్రధానాధికారి వైస్‌ అడ్మిరల్‌ సునీల్‌ లాంబా, సింగపూర్‌ నేవీ చీఫ్‌ రియర్‌ అడ్మిరల్‌ లీ చున్‌ హాంగ్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

భారత యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ శక్తిపై అతిథులు సమావేశమై.. సింబెక్స్‌లో పాల్గొంటున్న ఇరు దేశాల ఫ్లీట్‌ ఆఫీసర్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం విన్యాసాలు ప్రారంభమయ్యాయి. క్షిపణులతో దాడులు, మధ్యతరహా తుపాకులతో పరస్పర దాడులు, రాకెట్‌ ఫైరింగ్, జలాంతర్గామి నిరోధక పోరాటంతో పాటు యుద్ధ విమానాల విన్యాసాలతో ఇరుదేశాల నావికులు అలరించారు. బుధవారంతో సింబెక్స్‌ విన్యాసాలు ముగియనున్నాయి.

మరిన్ని వార్తలు