రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై టీడీపీలో ఉత్కంఠ

10 Mar, 2018 15:25 IST|Sakshi

ఇప్పటికీ మొదలు కాని కసరత్తు

మంత్రులతో భేటీ కానున్న చంద్రబాబు

సాక్షి, అమరావతి: రాజ్యసభ నామినేషన్ల చివరితేదీ సోమవారంతో ముగియనుండటంతో అమరావతి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై టీడీపీలో ఉత్కంఠ నెలకొంది. మరో రెండు రోజుల్లో గడువు ముగియనున్నా అభ్యర్థుల ఎంపికకు టీడీపీ కసరత్తు కొలిక్కిరాలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావుతో నేడు భేటీ కానున్నారు. రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికపై వీరితో చర్చించనున్నట్లు సమాచారం.

ప్రస్తుత రాజకీయ అవసరాలు, సామాజిక సమీకరణాల్ని బేరీజు వేసుకుని అభ్యర్ధుల కసరత్తు ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. కేవలం రెండు సీట్లకే పోటీచేయాలని టీడీపీ భావిస్తోంది. రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికలో తమ సామాజిక వర్గానికే పెద్ద పీట వేస్తారని ఎస్సీ, బీసీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు తమకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని మాదిగ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. దేశ రాజధానిలో టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేలా రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక ఉండాలని పార్టీ వర్గాలు కోరుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపికతోపాటు టీటీడీ బోర్డు చైర్మన్‌ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. 

మరిన్ని వార్తలు