టీడీపీ మేనిఫెస్టోను అమలు చేస్తాం

3 Jun, 2014 00:18 IST|Sakshi
టీడీపీ మేనిఫెస్టోను అమలు చేస్తాం

 కొరిటెపాడు(గుంటూరు), న్యూస్‌లైన్ :తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేసేందుకు తమ నాయకుడు చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ చెప్పారు. నియోజకవర్గంలోని కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని పార్టీ  జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఆయన  మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజునే రైతుల రుణమాఫీపై సంతకం చేసేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు తీసుకువచ్చి నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అమరరాజ కంపెనీ తరఫున 50 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
 
 తన గెలుపు కోసం కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. తనను గెలిపించినందుకు పార్టీ నాయకులు, కార్యకర్తల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం పార్టీ  రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు, నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్ మాట్లాడారు. సమావేశంలో మాజీ మంత్రి శనక్కాయల అరుణ, నాయకులు కందుకూరి వీరయ్య, గల్లా పద్మ, రావిపాటి సాయికృష్ణ, వేమూరి సూర్యం, షేక్ లాల్‌వజీర్, యాగంటి దుర్గారావు, ఎలుకా వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు