కేటీపీఎస్‌లో ఇంజనీర్స్ అసోసియేషన్ల జేఏసీ భారీ ర్యాలీ

22 Sep, 2013 05:50 IST|Sakshi

 పాల్వంచ, న్యూస్‌లైన్: ప్రాంతాల వారీగా విడిపోయి అన్నదమ్ముల్లా కలిసుందామని కేటీపీఎస్‌లోని అన్ని ఇంజనీర్స్ అసోసియేషన్ల జేఏసీ నాయకులు, అన్ని యూనియన్ల నాయకులు, కార్మికులు అం టున్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు వెం టనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం సాయంత్రం కేటీపీఎస్ 5, 6 దశల కర్మాగారం నుంచి కేటీపీఎస్ స్టోర్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర ్భంగా కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్‌లో ఉన్న అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేశారు.
 
 ఈ సందర్భంగా జెన్‌కో జేఏసీ కన్వీనర్ సంజీవ య్య, తెలంగాణ విద్యుత్ ఇంజనీర్స్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నెహ్రు, ఎన్.భాస్కర్‌లు మాట్లాడారు. కేంద్రం సీడబ్ల్యుసీలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వెంటనే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు తెలంగాణ వాదులంతా ఒక్కతాటిపై ఉండి పోరాడాలని అన్నారు. సీమాంధ్ర నేతలు కృత్రిమ ఉద్యమాలకు స్వస్తి పలికి స్నేహపూర్వకంగా విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉందామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్స్ సంఘాల నేతలు బాలరాజు, ప్రతాప్, కెనడీ, మధుబాబు, సతీష్, మంగీలాల్, సురేష్, 327, టీఎన్‌టీయుసీ, టీఆర్‌వీకేఎస్, 1535, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ నాయకులు, యూనియన్ల నాయకులు ఆర్.శ్రీను, గొర్రె వేణుగోపాల్, డోలి శ్రీను, నవీన్, కట్టా మల్లిఖార్జున్ రావు, టీఆర్‌ఎస్ నాయకులు కొత్త కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు