ఈనాటి ముఖ్యాంశాలు

28 Aug, 2019 21:11 IST|Sakshi

జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన 14 పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్ధానం కేంద్రానికి రెండు నోటీసులు జారీ చేసింది. ఆర్టికల్‌ 370 రద్దుకు సంబంధించిన అన్ని పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్‌ అక్టోబర్‌ నుంచి విచారిస్తుందని స్పష్టం చేసింది. దేశ భద్రత ఆర్థిక పురోగతికి అత్యంత కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. పోలీసు బలగాల ఆధునీకరణ ప్రాధాన్యతను వివరిస్తూ దేశంలో భద్రతా పరిస్థితి మెరుగవకుంటే ఆర్థిక పురోగతి సాధ్యం కాదని చెప్పారు. చంద్రయాన్‌ 2 ప్రయోగంలో మరో కీలకఘట్టం చోటుచేసుకుంది. మూడో లూనార్‌ బౌండ్‌ కక్ష్యలోకి చంద్రయాన్‌ 2  ఉపగ్రహాన్ని బుధవారం ఉదయం విజయవంతంగా చేర్చినట్లు ఇస్రో వెల్లడించింది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

మరిన్ని వార్తలు