శ్రీశైలానికి గోదారమ్మ!

26 Jun, 2019 05:29 IST|Sakshi

కృష్ణాలో నానాటికీ తగ్గిపోతున్న నీటి లభ్యత

కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తు పెంపుతో మరింత తగ్గనున్న నీటి లభ్యత

గోదావరి జలాలను శ్రీశైలానికి తరలించడంపై తెలుగు రాష్ట్రాల దృష్టి

28న భేటీ కానున్న రెండు రాష్ట్రాల సీఎంలు వైఎస్‌ జగన్, కేసీఆర్‌

ఇంద్రావతి కలసిన తర్వాత గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపుపై కసరత్తు

రోజుకు 5 – 6 టీఎంసీల వంతున 90 రోజులు తరలిస్తే ఎద్దడిని అధిగమించవచ్చు

సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో నీటి లభ్యత నానాటికీ తగ్గిపోతోంది. ఆగస్టు రెండో వారం నాటికిగానీ ఎగువ నుంచి కృష్ణా వరద ప్రవాహం శ్రీశైలానికి చేరడం లేదు. మరోపక్క కర్ణాటక సర్కార్‌ ఆల్మట్టి జలాశయం ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచుతున్న నేపథ్యంలో ఎగువ నుంచి వరద ప్రవాహం సెప్టెంబరు ఆఖరు నాటికిగానీ చేరే అవకాశం ఉండదు. ఫలితంగా కృష్ణాలో నీటి లభ్యత మరింత తగ్గడం ఖాయం. ఈ నేపథ్యంలో గోదావరి జలాలను శ్రీశైలం జలాశయంలోకి ఎత్తిపోస్తే ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశంతోపాటు అటు దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని ఆయకట్టును స్థిరీకరించవచ్చునని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖరరావులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశంపై చర్చించేందుకు ఈనెల 28న హైదరాబాద్‌లో ఇద్దరు సీఎంలు సమావేశమవుతున్నారు. గోదావరి వరద జలాలను గరిష్టంగా వినియోగించుకోవడంపై అధ్యయనం చేసి ఆలోగా నివేదికలను సిద్ధం చేయాలని ఇరు రాష్ట్రాల అధికారులను ఆదేశించారు. 

పలు ప్రతిపాదనలపై అధికారుల కసరత్తు
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశం కానున్న నేపథ్యంలో గోదావరి జలాలను శ్రీశైలం జలాశయానికి తరలించే ప్రతిపాదనలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావుతోపాటు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి తదితరులు గోదావరి జలాలను శ్రీశైలం జలాశయానికి మళ్లింపుపై సమాచారాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో పలు ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. గోదావరిలో ఇంద్రావతి నది కలసిన తర్వాత బ్యారేజీ నిర్మించి అక్కడి నుంచి రోజుకు కనీసం ఐదు నుంచి ఆరు టీఎంసీలను శ్రీశైలంలోకి తరలించే ప్రతిపాదనపై ప్రధానంగా చర్చిస్తున్నారు. జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) చేసిన ప్రతిపాదనల్లో ఇచ్చంపల్లి–నాగార్జునసాగర్, అకినేపల్లి–నాగార్జునసాగర్‌ అనుసంధానాలను రీడిజైనింగ్‌ చేసి ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను శ్రీశైలం తరలించడం.. అకినేపల్లి నుంచి శ్రీశైలం జలాశయంలోకి గోదావరి జలాలను ఎత్తిపోయడంపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ మూడు ప్రతిపాదనల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటిని వినియోగించుకునే ప్రతిపాదనపై మొగ్గు చూపాలని ఇరువురు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. గోదావరి నుంచి రోజుకు కనీసం ఐదు నుంచి ఆరు టీఎంసీలను శ్రీశైలం జలాశయంలోకి ఎత్తిపోస్తే తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పరీవాహక ప్రాంతంలో నీటి ఎద్దడిని అధిగమించవచ్చని సాగునీటి రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఆ 90 రోజులు నీటిని ఎత్తిపోస్తే..
ఏటా గోదావరిలో మూడు నుంచి నాలుగు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. ప్రాణహిత, ఇంద్రావతి ఉపనదుల ద్వారా గరిష్టంగా వరద జలాలు గోదావరిలోకి చేరుతున్నాయి. జూలై నుంచి అక్టోబర్‌ వరకూ ఏటా సగటున 90 రోజులపాటు గోదావరిలో గరిష్టంగా వరద ఉంటుంది. ఆ 90 రోజుల్లో నిత్యం సగటున నాలుగు నుంచి ఐదు టీఎంసీలను శ్రీశైలం జలాశయంలోకి ఎత్తిపోస్తే ఇటు ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టుల ద్వారా.. అటు తెలంగాణలో పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ఆయకట్టులను స్థిరీకరించవచ్చు. శ్రీశైలం జలాశయం నిండిన తర్వాత గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు తరలించి సాగర్‌ ఆయకట్టును స్థిరీకరించవచ్చు. అక్కడి నుంచి పులిచింతల మీదుగా ప్రకాశం బ్యారేజీకి నీటిని తరలించి కృష్ణా డెల్టా అవసరాలను తీర్చవచ్చునని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తున్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

ఒకటి అడిగితే సీఎం జగన్‌ రెండు చేస్తున్నారు..

రాష్ట్రంలో మూడు కొత్త స్టేడియాలు : అవంతి

సీఎం జగన్‌ను కలిసిన ‘నాటా’ బృందం

‘అందుకే విద్యుత్‌ ఒప్పందాలపై పునఃసమీక్ష’

తిరుమలలో యువతిపై ఎలుగుబంటి దాడి

శ్రీపూర్ణిమ‌ గ్రంథాన్ని ఆవిష్కరించనున్న వైఎస్‌ జగ‌న్

బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే రోజా

‘వారికి పునరావాసం కల్పించే బాధ్యత రాష్ట్రానిదే’

విద్యుత్‌ ఉద్యోగుల పంపకాలపై సుప్రీంలో విచారణ

ఏపీలో మావోయిస్టుల సమస్యలపై సబ్‌ కమిటీ

ట్రిపుల్‌ మర్డర్: రక్తంతో శివుడికి అభిషేకం

కర్నూలు జిల్లాలో పెద్దపులి అలజడి

టీడీపీ జెండా కట్టి, పచ్చ చొక్కా వేస్తేనే...

ఆర్‌ అండ్‌ ఆర్‌లో భారీ అక్రమాలు: జీవీఎల్‌

దాతల విస్మరణ.. మాజీల భజన..!

పోలీస్‌స్టేషన్‌లో దౌర్జన్యం

కలక్టరేట్‌ ఎదుట యువతి ఆత్మాహత్యాయత్నం

చంద్ర డాబు

అటవీ శాఖలో అవినీతి వృక్షం

పర్యాటకుల్ని మింగేస్తున్న సరియా జలపాతం..

వృత్తి ఆటోడ్రైవర్‌.. విదేశీయులకు సైతం మెలకువలు

ఆ హాస్పిటల్‌ను మూసివేశాం : మంత్రి ఆళ్ల నాని

పోలవరం ప్రాజెక్ట్‌ ఏపీకి సంజీవిని : అనిల్‌ కుమార్‌

‘2 వేల కంటే 15 వేలు తక్కువా చంద్రబాబు’

రా‘మాయ’పట్నమేనా..!

గోదాముల్లో రికార్డుల గందరగోళం

12 సర్కిల్‌ స్టేషన్లను ప్రారంభించాల్సి ఉంది

కడలి కెరటాలకు యువకుడి బలి

అక్రమాల ఇంద్రుడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!