వీఆర్‌ఏ పోస్టులకు అభ్యర్థుల కరువు

17 Jan, 2014 02:38 IST|Sakshi

ఒక్క అభ్యర్థీ దరఖాస్తు చేసుకోలేదు. మాజీ సైనికుల కేటగిరిలో భర్తీ చేయాల్సిన 5 పోస్టులకూ అదే పరిస్థితి. బీసీ-సీ జనరల్ కేటగిరికి కేటాయించిన 3 పోస్టులు, బీసీ-ఏ, ఎస్టీ మహిళలకు కేటాయించిన ఒక్కో పోస్టుకూ దరఖాస్తులు అందలేదు. ఈ పోస్టుల భర్తీకి జిల్లా రెవెన్యూ యంత్రాంగం నివేదికను రూపొందించి సీసీఎల్‌ఏకు పంపాల్సి ఉంది.
 దరఖాస్తులందని గ్రామాలివే!
 అంధ మహిళల విభాగంలో...: బి.కొత్తకోట మండలం గొల్లపల్లె, బీఎన్.కండ్రిగ మండలం నెలవాయి, చంద్రగిరి మండలం కల్రోడ్‌పల్లె, చిన్నగొట్టిగల్లు మండలం ఎగువూరు, చిత్తూరు మండలంలోని మురకంబట్టు, చౌడేపల్లె మండలం పెద్దయల్లకుంట్ల, గంగాధరనెల్లూరు మండలం గొల్లపల్లె గ్రామాల నుంచి దరఖాస్తులు రాలేదు.

కుప్పం మండలం కృష్ణదాసానపల్లె, నిమ్మనపల్లె మండలం వెంగంవారిపల్లె, పాకాల మండలం గోర్పాడు, పెనుమూరు మండలం నంజర్లపల్లె, పూతలపట్టు మండలం పూతలపట్టు గ్రామం, రామచంద్రాపురం మండలం చిట్టత్తూరు కాలేపల్లె, శాంతిపురం మండలం మోరసానిపల్లె, సత్యవేడు మండలం కన్నావరం, వడమాలపేట మండలం శ్రీబొమ్మరాజుపురం, వాల్మీకిపురం మండలం టిసాకిరేవుపల్లె నుంచి దరఖాస్తులు అందలేదు.

 మాజీ సైనికుల విభాగంలో...: చంద్రగిరి మండలం నరసింగాపురం, గుర్రంకొండ మండలం సరిమడుగు, ములకలచెరువు మండలం నాయనిచెరువు, తంబళ్లపల్లె మండలం ఎద్దులవారిపల్లె , వాల్మీకిపురం మండలం విఠలం గ్రామాల్లో మాజీ సైనికులు ఎవ్వరూ వీఆర్‌ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకోలేదు.
 బీసీ-సీ కేటగిరిలో...: క్రిస్టియన్లుగా మారిన ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించిన వీఆర్‌ఏ పోస్టులకు సంబంధించి గుర్రంకొండ మండలం తరిగొండరాచపల్లె, ములకలచెరువు మండలం పెద్దపాళెం, తంబళ్లపల్లె మండలం ఎద్దులవారిపల్లె నుంచి ఒక్కరూ దరఖాస్తు చేసుకోలేదు.

 వరదయ్యపాళెం మండలం మరదవాడ గ్రామాన్ని బీసీ-సీకి చెందిన మహిళకు కేటాయించారు. వి.కోట మండలం బోడిగుట్టపల్లెను ఎస్టీ మహిళకు కేటాయించగా ఆయా గ్రామాల నుంచి ఒక్క దరఖాస్తూ అందలేదు.
 గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోవడం వల్లే!
 వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి సంబంధించిన నిబంధనల వల్లే జిల్లాలో అభ్యర్థులు కరువయ్యారని పరిశీలకులు భావిస్తున్నారు. రోస్టర్ విధానం ప్రకారం ఆయా కేటగిరీలకు చెందిన అభ్యర్థులు  దొరకని పరిస్థితి నెలకొంటోంది. వీఆర్వో పోస్టుల మాదిరిగానే వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి జిల్లాను యూనిట్‌గా తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని నిరుద్యోగులు అంటున్నారు.
 

మరిన్ని వార్తలు