గిరిజనుడిగా పుట్టాలనుంది: మంత్రి

4 Oct, 2019 18:59 IST|Sakshi

సాక్షి, అరకు : ఆనాడు మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువు చెప్పిస్తే, ఈనాడు ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగమిచ్చారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. శుక్రవారం అరకులో ఏపీ టూరిజం యాత్రి నివాస్‌ హోటల్లో రెండు కోట్లతో నిర్మించిన డైనింగ్‌ రెస్టారెంట్‌ను స్థానిక ఎంపీ గొడ్డేటి మాధవితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తేరు గన్నెల , పద్మాపురం గ్రామాలకు చెందిన సర్పంచులు, వైస్ సర్పంచులు, వార్డు మెంబర్లు, టీడీపీకి చెందిన 211 కుటుంబాల కార్యకర్తలు మంత్రి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.

అనంతరం అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. బాక్సైట్‌ మైనింగ్‌ను రద్దు చేసిన దమ్మున్న నాయకుడు వైఎస్‌ జగన్‌ అని అభినందించారు. గిరిజనులకు మెడికల్‌ కాలేజ్‌, గిరిజన యూనివర్సిటీ ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రిదని ప్రశంసించారు. అన్ని గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, రూ.156 కోట్లతో అరకు టూరిజం కారిడార్‌ను అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడున్నది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని చెప్పారు. గిరిజనులు అమాయకులనీ, మళ్లీ జన్మంటూ ఉంటే గిరిజనుడిగా పుట్టాలనుందని అన్నారు.


ఎంపీ మాధవి మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి ఆశీస్సుల వల్ల చిన్న వయసులోనే ఎంపీ కాగలిగానని ఆనందం వ్యక్తం చేశారు. భారత టూరిజం శాఖ పార్లమెంటు కమిటీలో తాను మెంబరుగా ఉన్నాననీ, అరకు టూరిజంను దేశంలోనే మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేస్తానని వెల్లడించారు. అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ.. అరకును దత్తత తీసుకొని చంద్రబాబు అంధకారంలో ఉంచారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అరకు నియోజకవర్గానికి 39 రోడ్లను మంజూరు చేశారని, ఇతర మౌలిక సదుపాయాల కోసం నిధులు విడుదల చేశారని తెలిపారు. ప్రభుత్వం తనకిచ్చిన క్వార్టర్‌ను గిరిజన మహిళల కోసం ప్రసూతి హాస్టల్‌గా మార్చానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మీ కూడా పాల్గొని మాట్లాడారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో ఏఎస్పీలకు పోస్టింగ్‌

ఇకపై ఏపీ నుంచే హజ్‌ యాత్ర..

దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

టెండర్ల ఫైళ్లను మీడియా ముందుంచిన డిప్యూటీ సీఎం

దేశంలో ఏరాష్ట్రంలోనూ లేని పథకం ఇది

‘జూ.ఎన్టీఆర్‌ను చంద్రబాబు వదల్లేదు’

క్షుద్ర పూజలు చేయించింది నువ్వు కాదా?

బంగ్లా కోస్ట్‌గార్డ్‌ అదుపులో ఆంధ్ర జాలర్లు

‘చంద్రబాబు నికృష్ట చర్యలు మానుకోవాలి’

సిగ్గులేని బతుకులు ఎవరివో చెప్పమంటే..

పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం: సీపీ

‘సమీర్‌- రాణి’ పిల్లలకు నామకరణం!

‘ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్లు ఇవ్వాలి’

అక్టోబర్‌ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు: సీఎం జగన్‌

ఆటో డ్రైవర్‌గా మారిన మంత్రి అవంతి

కార్పొరేషన్‌ హోదా ఉన్నట్టా..లేనట్టా?

మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

మాదకద్రవ్యాల అడ్డాగా రాజధాని

జిల్లాలో వణికిస్తున్న వైరల్‌

మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌

మంత్రాలయం–కర్నూలు రైల్వే లైనెప్పుడో? 

చదువుకుంటానంటే..పెళ్లి చేస్తున్నారని..

ఏలూరు చేరుకున్న సీఎం జగన్‌

సైరా..సై..ఎద్దుల కుమ్ములాట!

ఎకో బొకేకి జిందాబాద్‌!

కల్పవృక్షంపై కమలాకాంతుడు

అటు పర్యావరణ పరిరక్షణ.. ఇటు జంతు సంరక్షణ

ఉపాధ్యాయులను పీడిస్తున్న ఎంఈఓలు

మా కడుపులు కొట్టొద్దు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వార్‌ టీం సక్సెస్‌ పార్టీ..

అల్లు ఫ్యామిలీ ‘సైరా’ పార్టీ

యూట్యూబ్‌ సెలబ్స్‌

సైరా కోసం గుండు కొట్టించిన రామ్‌చరణ్‌!

సైరా ‘లక్ష్మి’కి ఉపాసన సూపర్‌ గిఫ్ట్‌

బిగ్‌బాస్‌: పుల్లలు పెట్టడం స్టార్ట్‌ చేసిన మహేశ్‌