రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

12 Dec, 2013 03:35 IST|Sakshi

నెల్లుట్ల(లింగాలఘణపురం), న్యూస్‌లైన్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన సంఘటన మండలంలోని జనగామ- సూర్యాపేట రో డ్డులోని ఆర్టీసీకాలనీ సమీపంలోని కల్వర్టు వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై మధూకర్ కథ నం ప్రకారం.. మద్దూ రు మండలంలోని ధూల్మిట్టకు చెందిన కొలిపాక మల్లయ్య (42) రాజీవ్ విద్యామిషన్ పథకంలో కాంట్రాక్టు ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, జన గామ మండలంలోని శామీర్‌పేటకు చెందిన బనిక సత్తయ్య (40) ఇదే ఆర్‌వీఎంలో సీఆర్‌పీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే బుధవారం రాత్రి వీరిద్దరు బైక్‌పై నెల్లుట్ల వైపు నుంచి జనగామకు వస్తుండగా ఆర్టీసీకాలనీ సమీపంలోని కల్వర్టు వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది.

ఈ సం ఘటనలో మల్లయ్య, సత్తయ్యలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కాగా, మృతుడు మల్లయ్యకు భార్య పద్మ, కొడుకు చక్రధర్, కూతురు చందన, సత్తయ్యకు భార్య కళావతి, కూతురు శ్వేత, కుమారుడు సాయికిరణ్ ఉన్నారు. కాగా, సంఘటన స్థలాన్ని జనగామరూరల్ సీఐ ప్రవీణ్‌రెడ్డి, లింగాలఘణపురం ఎస్సై మధూకర్, జనగామ అర్బన్ సీఐ నరేందర్ సందర్శించి, మృతదేహాలను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు