లారీ టూల్ బాక్స్లో మహిళ అస్థిపంజరం

29 Oct, 2013 13:05 IST|Sakshi
లారీ టూల్ బాక్స్లో మహిళ అస్థిపంజరం

మహబూబ్నగర్ : మహబూబ్ నగర్ జిల్లాలో ఓ మహిళ అస్థిపంజరం కలకలం సృష్టించింది. బిజినేపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసుల స్వాధీనంలోని ఓ లారీ టూల్ బాక్స్ లోంచి ఈ అస్థి పంజరం బయటపడడంతో సంచలనం కలిగించింది. ఏడేళ్ల క్రితం 2007 జనవరి 10న జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉంచారు.

ఈ కేసును రెండేళ్ల క్రితం  కోర్టులో కొట్టేశారు. అప్పటి నుంచి చెడిపోయిన లారీకి మరమత్తులు చేయించేందుకు మెకానిక్ను తీసుకుని యజమాని  స్టేషన్ వద్దకు వచ్చి చూడగా లారీలో మహిళ అస్థి పంజరం కనిపించింది. మృతురాలు బిజినేపల్లికి చెందిన లక్ష్మమ్మగా పోలీసులు భావిస్తున్నారు.