భద్రాచలం జోలికి వస్తే సహించం : ఏబీవీపీ

21 Nov, 2013 23:12 IST|Sakshi

జవహర్‌నగర్ :భద్రాచలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణనుంచి విడదీయరాదని, ఈ విషయంలో ఎలాంటి తేడా వచ్చినా సహించేది లేదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం జవహర్‌నగర్‌లో సీమాంధ్ర నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ హైదరాబాద్ సంయుక్త కార్యదర్శి జోగారామ్ మాట్లాడుతూ భద్రాచలం ప్రాంతవాసుల అభీష్టం మేరకు డివిజన్‌ను తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్ చేశారు.

 

సీమాంధ్రుల కుట్రల నుంచి భద్రాచలాన్ని రక్షించుకునేందుకు తెలంగాణ ప్రజాప్రతినిధులు పార్టీలకతీతంగా ఉద్యమించాలన్నారు. కాంగ్రెస్ చేతకాకపోతే బీజేపీ అయినా తెలంగాణ ఇస్తుందని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడం ఎవరి తరం కాదని అన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ సికింద్రాబాద్ జోనల్ ఇన్‌చార్జి రాంబాబు, జవహర్‌నగర్ అధ్యక్షుడు గోపాల్, వీహెచ్‌పీ నాయకులు సంతోష్, యోగి, రవీందర్ గౌడ్, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు