నాడు జై.. నేడు నై...

22 Feb, 2014 04:43 IST|Sakshi
నాడు జై.. నేడు నై...

 సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ చారిత్రక నగరం రాజమండ్రిలో దీనస్థితికి దిగజారింది. ఈ పార్టీ పరిస్థితి నడిసంద్రంలో చుక్కాని లేని నావలా మారింది.
  నగరంలో పార్టీకి దిశానిర్దేశం చేసే నేతలు కరువయ్యారు. ఒకనాడు పార్టీలో చక్రం తిప్పిన నాయకులంతా నేడు కొత్తపార్టీ కోసం ఆశతో చకోరాల్లా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి సమైక్యాంధ్ర ఉద్యమం కాంగ్రెస్ పాలిట సునామీగా మారింది. రాష్ట్ర విభజన నిర్ణయం జనాగ్రహానికి గురైంది. పార్టీ భవితవ్యంపై చీకటి అలముకుంది.
 
 సాక్షి, రాజమండ్రి :
 రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర విభజన పెను అలజడి సృష్టించింది. ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వారి వర్గం నేతలు పార్టీకి రాజీనామాలు చేయడంతో కార్యకర్తలు కూడా లేని దుస్థితి ఏర్పడింది. పార్టీపై జిల్లా అధ్యక్షుడి అదుపు కూడా లేకుండా పోయిందని ఒకప్పటి పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
 
 

మరిన్ని వార్తలు