పరుగు..ఇలా మెరుగు

9 Jul, 2015 23:58 IST|Sakshi

విశాఖపట్నం : పరుగు తీసేందుకు ఒక పద్ధతి ఉంటుంది. స్పీడ్ రేస్ ఈవెంట్‌కు  మిడిల్ డిస్టెన్స్ రన్నింగ్‌కు   తేడా గమనించాలి.  వంద  మీటర్ల పరుగును ఎనరోబిక్‌గా (శ్వాసను సయితం నియంత్రించి) పూర్తి చేస్తే కిలోమీటర్ల మేర పరుగు పెట్టెప్పుడు ఎయిరోబిక్‌గా క్రమపద్దతిలో గాలి పీల్చుకుంటూ పరుగు తీయాల్సి ఉంటుంది. జాగ్రత్తలు పాటిస్తూనే నిర్ణీత సమయంలో దేహదారుఢ్య పరీక్షలో పరుగును పూర్తి చేస్తేనే ఫిట్‌నె స్‌తో కూడుకున్న ఉద్యోగాల్లో ప్రాథమిక స్థితిని అధిగమించి ఫలితాన్ని పొందగలుగుతారు.  లేకుంటే పరుగులో  ప్రమాదమూ పొంచి ఉంటుంది.  పరుగు పరీక్షకు ముందు ఇలా సమాయత్తమైతే విజయం మీదే....
 
 ఇలా పరుగు వద్దు: ఖాళి కడుపుతోనో.. లేదా పూర్తిగా నిండిన కడుపుతో పరుగు పెట్టరాదు. పరుగు ప్రారంభించే రెండు నుంచి నాలుగు గంటల ముందే ఎక్కువ మోతాదులో నీటిని తీసుకోవాలి. అంతే గాని పరుగు ప్రారంభానికి ముందో లేదా పరుగెడుతున్నప్పుడో నీ టిని తీసుకోకూడదు.  అత్యవరమైతే సిప్ చేయవచ్చు.
 
 గమ్యంపై అవగాహన
 ఆర్మీ, పోలీస్ లాంటి ఉద్యోగాల కోసం యువకులు పరుగుపై పూర్తి అవగాహన లేకుండానే సిద్ధమవుతుంటారు.  లాప్ నుంచి మరో లాప్ పూర్తిచేసేప్పుడే రెంటి మధ్య కాల వ్యత్యాసాన్ని గమనించుకోవాలి.  అందుకు తగిన విధంగా  శరీరాన్ని సమాయత్తం చేసుకోవాలి. అందుకు ఫిట్‌నెస్ దోహదపడుతుంది.  ఒక కిలోమీటర్ పరుగుకు సాధారణ స్టేడియాల్లో రెండున్నర లాప్‌లు పరుగెట్టాల్సి ఉంటుంది.  తొలి లాప్‌లోనే వేగంగా పరుగెట్టిస్తే ఎండ్యూరెన్స్ తగ్గిపోయి చివరి లాప్ కష్టమైపోతుంది.  
 
 నోటితో కాదు:  పరుగులో శిక్షణ లేని అథ్లెట్లు నోటితో గాలి లోపలికి తీసుకుంటారు.  కేవలం ముక్కుతోనే తీసుకోవాలి.  కొందరికి శ్వాసనాళాల్లో సమస్య ఉంటే వారికి తెలీకుండానే నోటితో పీల్చేస్తారు.  అది శరీరదారుఢ్య పరీక్షలప్పుడు ప్రమాదానికి దారి తీస్తుంది. పరుగు ప్రారంభించడానికి ముందే ముక్కుతో ధీర్ఘంగా గాలి   తీసుకోవడం, అదే ఒత్తిడితో బయటికి వదలడంలో సాధన చేసి పరుగుకు సిద్ధమవ్వాలి.   శ్వాసపై  దృష్టిపెడుతూనే అందుకు అనువుగా కాళ్లలో వేగం పెరగాలి.  అప్పుడే నిర్ణీత సమయంలో గమ్యాన్ని చేరుకోవచ్చు.
 
 వార్మప్ చేయాలి: పరుగు ప్రారంభించడానికి కొద్ది సేపటి ముందే శరీరాన్ని అందుకు అనువుగా వార్మప్ ఎక్సర్‌సైజ్‌లతో మార్చుకోవాలి. అలా చేయకుండా ఒక్కసారిగా పరుగుకు సమాయత్తం కావడం సరికాదు. నిద్రపోవాలి : పరుగు పరీక్షకు ముందురోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలి.  దాంతో ఒత్తిడి బాగా తగ్గిపోతుంది.  ఆ ప్పుడు తీసుకునే ఆహారం పరుగు సమయంలో ప్రభావం చూపిస్తుంది. కనుక తగిన మోతాదులోనే తీసుకోవాలి. డీహైడ్రేషన్ : పరుగు పెట్టెటప్పుడు శరీరంలోని నీటి శాతం తగ్గుతుంది.  కార్బొహైడ్రేట్స్‌ను శరీరం వినియోగించుకుంటుంది. డిస్టెన్స్ రన్స్‌లో నీటిని  తీసుకోవడంలో శ్రద్ధ వహించాలి. మానవుని శరీరంలో 82 శాతం నీటిమయమే. పరుగెత్తేప్పుడు చెమట పట్టడం ద్వారా తగ్గుతుంది. అందుకే కుడిచేత్తో నీటిని సిప్ చే స్తూ పరిగెట్టడం ద్వారా ఈ సమస్య అధిగమించవచ్చు.   
 
 శరీరాన్ని చల్లబరుచుకోవాలి : దేహా దారుఢ్య పరీక్షలను ఎండ తీవ్రత రాకుండగానే ముగించాలి.  ఎండలు మండిపోతున్నా యువకులు పరుగు పెట్టా ల్సి వస్తుంది. ఇలాంటప్పుడు పరుగు పెడుతూనే నీటిని శరీరంలోకి తీసుకోకుండా శరీరాన్ని చల్లబరిచేందుకే వినియోగించాలి. అంటే నీటిని తలపై వేసుకోవడం ద్వారా టెంపరేచర్‌ను సరిచేసుకోవచ్చు. తడి కాప్ పెట్టుకోవడం ద్వారా కొంత ఉపశమనం వస్తుంది.  పరుగు పూర్తయిన తర్వాత : పరుగు పూర్తయ్యాక శరీరాన్ని కూల్ చేసుకోవాలి. మనం ఎంత మేర నీటి శాతాన్ని కోల్పోయామో అంత మోతాదును తీసుకోవాలి. ఎక్కువ దూరం పరుగులో 500మిల్లీలీటర్ల నీటిని వెంటనే తీసుకోవాలి. ఆరుగంటల్లోపే యూ రిన్‌కి పోవాలి. లేకుంటే కిడ్నీ సమస్య తలెత్తుతుంది.
 
 కండరాల బ్రేక్ డౌన్ వల్లే..
 శరీరాన్ని అతిగా కష్టపెట్టటం వల్ల శరీరంలో కండరాలకు గాయం ఏర్పడుతుంది. దీని వల్ల మజిల్ ప్రొటీన్ అనేది విడుదలవుతుంది. దీంతో రక్తం చిక్కబడి పోతుంది. దీంతో రక్తంలో హైడ్రోజన్ స్థాయి పడిపోతుంది. 7.35 నుంచి 7.45 ఉండాల్సిన హైడ్రోజన్ స్థాయి 7.01కి నీలబాబు విషయంలో అదే జరిగింది. దీని వల్ల రక్తం శుద్ధి చేయటంలో కిడ్నీలకు కష్టతరంగా మారిపోతుంది. రక్తాన్ని వడకట్టలేక పోతాయి. మూత్రం బంధింపబడుతుంది. ఈ స్థితిని ఎసిలోసిస్ అంటారు. రోగి క్రమంగా షాక్‌లోకి వెళ్లిపోతాడు. ఈ పరిస్థితిని  కార్డియోకరప్ట్ వస్తుంది. నగరంలో ఎండలు పెరిగిపోవటం, గాలిలో తేమ ఎక్కువుగా ఉండటం కూడా ఒక కారణం.
 -ఎం.మధుసూదనబాబు,
  కేజీహెచ్ సూపరింటెండెంట్  
 

>
మరిన్ని వార్తలు