మహానేత వైఎస్సార్‌కు ఘన నివాళి

3 Sep, 2013 04:32 IST|Sakshi
మంకమ్మతోట/కలెక్టరేట్, న్యూస్‌లైన్ : దివంగత నేత  వైఎస్. రాజశేఖరరెడ్డి 4వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కరీంనగర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ అక్కెనపెల్లి కుమార్ ఆధ్వర్యంలో సోమవారం వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ అమర్‌హై.. వైఎస్సార్ ఆశయాలు కొనసాగిస్తామంటూ నినాదాలు చేశారు. ముందుగా నూతనంగా ఏర్పాటుచేసిన పార్టీ జెండాను కుమార్ ఆవిష్కరించారు. హౌసింగ్‌బోర్డు కాలనీలోని శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి అనాథ వృద్ధాశ్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ సమన్వయకర్త సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.
 
 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్ ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. పేద , బడుగు బలహీన వర్గాల కోసం వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలతో  పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు.  ప్రభుత్వం 108 వంటి సర్వీసులను రద్దు చేయాలని చూస్తోందని, పథకాలకు పేర్లు మార్చి కొత్తపథకాలు ప్రవేశపెడుతున్నట్లు ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో రైతు విభాగం జిల్లా కన్వీనర్ దామెర విద్యాసాగర్‌రెడ్డి, ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ మోకెనపెల్లి రాజమ్మ, మైనార్టీ విభాగం జిల్లా కన్వీనర్ ఎండీ అస్లమ్, జిల్లా నాయకులు డాక్టర్ కె.నగేశ్, 
 
 చింతల ఎల్లారెడ్డి, గద్దల వినయ్‌కుమార్, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ సందమల్ల నరేశ్, మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి గంట సుశీల, మైనార్టీ సెల్ నగర కన్వీనర్ ఎండీ.జావిద్, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు జూపాక సుదర్శన్, అధికార ప్రతినిధి కాసారపు కిరణ్, నగర అధ్యక్షుడు తోట కృష్ణ, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు గాలి ప్రశాంత్‌బాబు, నాయకులు దేవరనేని వేణుమాధవ్‌రావు, తోట నరేశ్, అవినాశ్‌రెడ్డి, గంట సతీశ్, గండి గణేశ్, శ్రీనివాస్, సురేశ్, ఆనంద్, బాబు పాల్గొన్నారు. 
 
 ప్రభుత్వాస్పత్రిలో పండ్ల పంపిణీ
 వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా అధికార ప్రతినిధి అయిలు రమేశ్ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో యువజన విభాగం జిల్లా కన్వీనర్ మందల మహేందర్‌రెడ్డి, జిల్లా  ఉపాధ్యక్షుడు కోమాకుల శ్రీనివాస్ రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పిల్లల వార్డులో అనారోగ్యం బాధపడుతున్న గంగాధర మండలం మంగపేటకు చెందిన షకీల్(9)ను హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించేందుకు అతడి తల్లి గోరేబీకి ఆర్థిక సాయమందించారు. అక్కడి డాక్టర్‌కు ఫోన్‌చేసి నాణ్యమైన వైద్య సేవలందించాలని కోరారు. ప్రెస్‌భవన్‌లో వైఎస్సార్ వర్ధంతి నిర్వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరేలా ప్రజల పక్షాన పోరాడుతామని అన్నారు.
 
   ప్రస్తుత కిరణ్ సర్కార్ వైఎస్ పథకాలను నీరుగార్చే కుట్రలు పన్నుతున్నారని అన్నారు. వైఎస్సార్‌సీపీ మూడు ప్రాంతాలకు సమన్యాయం కోసం పోరాటం చేస్తుందని, అది సమైక్యాంద్ర ఉద్యమానికి మద్దతు అనుకోవడం పొరపాటవుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ తెలంగాణలో ఖాళీ అయిందంటూ దుష్ర్పచారంతో కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ సండ్రు విజయ్‌కుమార్, పారుపల్లి రవీందర్, కాటం శివారెడ్డి, మహిళా విభాగం నగర కన్వీనర్ బోగె పద్మ, నిర్మల, కాటం శివారెడ్డి, ముల్కల గోవర్ధన్, సురేందర్‌రాజు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు