వైఎస్సార్ సీపీ సమైక్య నినాదానికి ప్రజల మద్దతు

31 Jan, 2014 00:24 IST|Sakshi
సాక్షి, కాకినాడ :గడపగడపకు వైఎస్సార్‌సీపీ సమైక్య నినాద పాదయాత్రలకు గ్రామీణ ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఈ పాద యాత్రల్లో పార్టీ కో ఆర్డినేటర్లతో పాటు ముఖ్యనేత లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో రూరల్ మండల పరిధిలోని కొంతమూరులో గడపగడపకు వైఎస్సార్ సీపీ పాదయాత్ర నిర్వ హించారు. ఇంటింటికి తిరిగి సమైక్యాంధ్ర కోసం ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. తుని నియోజకవర్గ కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని 1వ వార్డులో గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ఈ కార్య క్రమంలో పాల్గొని సమైక్యనినాదాలతో హోరెత్తించారు.
 
 కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆత్రేయ పురం మండలం తాడిపూడిలో గడపగడపకు వైఎస్సార్‌సీపీ నిర్వహించారు. జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి డేవిడ్‌రాజు, జిల్లా సేవాదళ్ కన్వీనర్ మార్గన గంగాధర్ పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పట్టణ పరిధి లోని 2వ వార్డులో గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో పి.గన్న వరం మండలం కె.ఏనుగుపల్లిలో నిర్వహించిన గడగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పి.కె. రావు, రైతు విభాగం రాష్ట్రకమిటీ సభ్యుడు జక్కంపూడి తాతాజీ, విప్పర్తి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. సమైక్యరాష్ర్ట ఆవశ్యకతను వారు గ్రామస్తులకు వివరించారు. కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ రూరల్ మండల పరిధిలోని కొవ్వూరు గ్రామంలో గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వందలాది కార్యకర్తలు వెంటరాగా పార్టీ విధి విధానాలను వేణు ప్రజలకు వివరించారు.
 
మరిన్ని వార్తలు