వైఎస్సార్‌ సేవలు మరువలేనివి

9 Jul, 2018 09:39 IST|Sakshi
పెందుర్తి కూడలి వద్ద వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న అదీప్‌రాజ్‌

పెందుర్తి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి 69వ జయంతి వేడుకలు పెందుర్తి నియోజకవర్గంలో ఆదివారం వేడుకగా జరిగాయి. పెందుర్తి కూడలి వద్ద రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి చేసిన సేవలు మరువలేనివన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దిన ఘనత వైఎస్సార్‌దే అన్నారు. వైఎస్సార్‌ మరణానంతరం రాష్ట్రంలో పరిస్థితులు దిగజారాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం గద్దెనెక్కాక ఆ పార్టీ నాయకులు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని విమర్శించారు. మళ్లీ రాష్ట్రానికి సువర్ణ పాలన అందించాలంటే వైఎస్సార్‌ తనయుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమన్నారు.

ప్రజల కష్టాలు తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసంకల్పయాత్ర చేస్తున్నారన్నారు. త్వరలో నియోజకవర్గంలో అడుగు పెట్టనున్న జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అక్కిరెడ్డిపాలెంలో వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. 500 మంది పేదలకు చీరలు పంపిణీ చేశారు. సుజాతనగర్‌లో వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నాయకులు, కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు. ముందుగా వేపగుంట నుంచి కృష్ణరాయపురం, పురుషోత్తపురం, సుజాతనగర్, చినముషిడివాడ, పెందుర్తి ప్రభుత్వ కళాశాల, పెందుర్తి కూడలి మీదుగా అక్కిరెడ్డిపాలెం వరకు భారీ బైక్‌ ర్యాలీ చేపట్టారు.

పార్టీ జిల్లా కార్యదర్శి గొర్లె రామునాయుడు, వార్డుల అధ్యక్షులు ముమ్మన వెంకటరమణ, దాసరి రాజు, ఎల్బీ నాయుడు, మండల కన్వీనర్‌ నక్కా కనకరాజు, సర్పంచ్‌ గొరపల్లి సాంబ, నాయకులు శరగడం నరసింహమూర్తి, నడింపల్లి రామరాజు, వడ్డాది అప్పలరాజు, చిప్పల చందు, రాపర్తి మాధవరావు, వినోద్, వర్మ, నర్సింగ్, చందుయాదవ్, మండవ గౌరీ లక్ష్మి, కరక శ్యామల, చిరికి దేముడు తదితరులు పాల్గొన్నారు.

 
పినగాడిలో వైఎస్సార్‌కు బాలరాజు నివాళి
పినగాడిలో వైఎస్సార్‌ విగ్రహానికి మాజీ మంత్రి పి.బాలరాజు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బయిలపూడి భగవాన్‌ జయరామ్, నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్, కాంగ్రెస్‌ నాయకుడు సతీష్‌వర్మ పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

అడవివరంలో..
సింహాచలం: భీమిలి నియోజకవర్గం 72వ వార్డు పరిధి అడవివరం మార్కెట్‌ కూడలిలో వైఎస్సార్‌ సీపీ వార్డు అధ్యక్షుడు కొలుసు ఈశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్సార్‌ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి చిత్రపటం వద్ద కేక్‌ కట్‌ చేశారు. మధ్యాహ్నం 1000 మందికి అన్నప్రసాదం అందజేశారు. వైఎస్సార్‌సీపీ భీమిలి సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, విశాఖ పార్లమెంటరీ ఇన్‌చార్జి ఎం.వి.వి.సత్యనారాయణ మధ్యాహ్నం అడవివరం వచ్చి వైఎస్సార్‌కు నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ 72వ వార్డు నాయకులు నడింపల్లి రామరాజు, గుడ్ల గురునాథరెడ్డి, బోర కృష్ణారెడ్డి, దాసరి కనకరాజు, నగిరెడ్డి వెంకటరావు, కొణపల సత్యనారాయణ, బొట్టా శ్రీను, బంటుబిల్లి త్రినాథ్, ఆదిరెడ్డి, రాంభుక్త ప్రసాదరావు, చల్లా రాఘవ, రాపత్తి రాము, కె.అప్పలనాయుడు, మజ్జి అప్పలరమణ, దమ్ము ఎర్రాజీరావు, కరోతు రాము, మొయ్యి రమణ, మజ్జి శ్రీను, కంది అప్పారావు పాల్గొన్నారు.

పరవాడ: జీవీఎంసీ 55 వార్డు దేశపాత్రునిపాలెంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి జయంతిని వైఎస్సార్‌సీపీ నాయకుడు కాసు అంజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇక్కడి పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ కాంస్య విగ్రహనికి పార్టీ నాయకులు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంజిరెడ్డి కేక్‌ కట్‌ చేశారు. సీఈసీ సభ్యుడు పైల శ్రీనివాసరావు, పార్టీ పరవాడ మండల అధ్యక్షుడు సిరపరపు అప్పలనాయుడు, ఆర్‌ఈసీఎస్‌ మాజీ చైర్మన్‌ చల్లా కనకారావు, పార్టీ నాయకులు బండారు రామారావు, రాము, రమణ, వినోద్, నరేష్, వెంకటరావు పాల్గొన్నారు.

 
పరవాడ: పరవాడలోని వైఎస్సార్‌ కాంస్య విగ్రహానికి పార్టీ సీఈసీ సభ్యుడు పైల శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో పార్టీ మండల అధ్యక్షుడు సిరపరపు అప్పలనాయుడు, పరవాడ సర్పంచ్‌ చుక్క రామునాయుడు, ఆర్‌ఈసీఎస్‌ మాజీ చైర్మన్‌ చల్లా కనకారావు, పార్టీ నాయకులు పైల అప్పలనాయుడు(జూనియర్‌), బండారు రామారావు, పైల హరీష్, బొద్దపు చిన్నారావు, పి.అప్పలనాయుడు, ఎస్‌.సూర్యనారాయణరాజు, పెదిశెట్టి శేఖర్, గోవిందు, వెన్నల నరసింగరావు, సన్యాసిరావు, కె.తాతాజీ, వాసు, బొంది మహేష్, సూరాడ ముత్యాలరావు, ఈరిగిల ప్రసాద్, అప్పారావు పాల్గొన్నారు.
 
సబ్బవరం: సబ్బవరంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి పార్టీ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచి పెట్టారు. అనంతరం సబ్బవరం మూడు రోడ్ల కూడలిలోని వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు కొటాన రాము, పార్టీ మండల కన్వీనర్‌ తుంపాల అప్పారావు, సమన్వయ కమిటీ సభ్యులు వడ్డాది అప్పలరాజు, కొటాన వెంకటరమణ, బోకం శ్రావణ్‌కుమార్, మండల సేవాదళ్‌ అధ్యక్షుడు టి.శేఖర్, నాయకులు లకినేని కేశవరావు, పిల్లల అప్పలనాయుడు, కడియాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. బాటజంగాలపాలెం శివారు అజయ్‌నగర్‌లో వైఎస్సార్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు.

మరిన్ని వార్తలు