‘రైతుల విషయంలో ప్రభుత్వం విఫలం’

25 Apr, 2019 12:28 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్సార్‌సీసీ రైతు విభాగం అధ్యక్షుడు ఎమ్‌ వీరప్ప ఎస్‌ నాగిరెడ్డి మండిపడ్డారు. ఆయన గురువారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతుకు చట్టబద్దంగా దక్కాల్సిన ధర కూడా ఇవ్వకుండా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహించారు. ఎకరాకు కౌలు రైతు ముప్పై వేలు నష్టపోయారని, గోదావరి జిల్లాలో ఈసారి వరి అత్యధికంగా పంట దిగుబడి వచ్చినా.. రైతులకు మాత్రం ఏ రకమైన లాభం చేకూరలేదని విమర్శించారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన కరువు మండలాల్లో సైతం ఇన్సూరెన్స్‌, ఇన్‌పుట్‌ సబ్సిడీ గానీ పంపిణీ చేయలేదన్నారు. ఈ సమావేశంలో త్రినాద్‌ రెడ్డి, దొరయ్య, రాజబాబు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు