టీడీపీ.. తెలుగు దుర్యోధనుల పార్టీ

7 Feb, 2017 13:31 IST|Sakshi
టీడీపీ.. తెలుగు దుర్యోధనుల పార్టీ

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో మహిళలకు రక్షణ లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. దేశంలో మహిళలకు భద్రత లేని ఏకైక రాష్ట్రం ఏపీనేనని, రాష్ట్రంలో 11 శాతం క్రైమ్ రేట్‌ పెరిగిందని స్వయంగా డీజీపీనే చెప్పారని వెల్లడించారు. టీడీపీ తెలుగు దుర్యోధనుల పార్టీగా మారిందని విమర్శించారు.

మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు బృందాకారత్, మేధాపట్కర్ లాంటి వారిని ఎందుకు ఆహ్వానించలేదని రోజా ప్రశ్నించారు. మహిళలపై ఏమాత్రం గౌరవం లేని టీడీపీ ప్రభుత్వం మహిళా పార్లమెంటేరియన్ సదస్సును రాజకీయంగా వాడుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై సదస్సులో తాము వినతిపత్రం ఇస్తామని చెప్పారు. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా తాము అండగా ఉంటామని, మహిళా సంక్షేమం గురించి మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదని అన్నారు.

మహిళల మాన, ప్రాణాలతో ఆడుకుంటున్న చంద్రబాబు సదస్సుకు వచ్చి మాట్లాడితే మహిళలు అంగీకరిస్తారా అని రోజా ప్రశ్నించారు. మహిళలపై దాడుల విషయంలో మంత్రి దేవినేని ఉమ మొదటి స్థానంలో ఉంటే, మరో మంత్రి అచ్చెన్నాయుడు రెండోస్థానంలో ఉన్నారని అన్నారు.