‘బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని తొలగించండి’

7 Feb, 2017 13:43 IST|Sakshi
‘బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని తొలగించండి’

న్యూయార్క్:ఆపరేషన్‌ లో బ్లాక్‌ మనీలో భాగంగా  బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని తొలగించాలని నీతి ఆయోగ్‌  వైస్ చైర్మన్ అరవింద్ పనాగారియా  సూచించారు.  బంగారం అక్రమ రవాణాను అరికట్టేందుకు తద్వారా నల్లధనాన్ని నిరోధించేందుకు  బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని తొలగించాలని అభిప్రాయపడ్డారు. కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్‌ పై   దీపక్ నీరా రాజ్ సెంటర్ లో  భారత ఆర్థిక విధానాలపై సోమవారం నిర్వహించిన  సదస్సులో  ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇండియన్‌ ఎకానమీ పాలసీ, పెర్‌ఫామెన్స్‌పై ఉపన్యాసం  సందర్భంగా  విద్యార్థులు ప్రశ్నలకు పనాగరియా సమాధానం చెప్పారు.  బంగారంపై ప్రస్తుత కస్టమ్స్ సుంకం అక్రమ రవాణాకు దారితీస్తుందని చెప్పారు. ఈ రవాణా "భారీ మొత్తంలో" ఉందని ఆయన పేర్కొన్నారు. సుంకాన్ని రద్దుచేయడం, లేదా తగ్గించడం ద్వారా పసిడి అక్రమరవాణాను అడ్డుకోవచ్చన్నారు. దేశంలోని అక్రమంగా బంగారం ప్రవేశిస్తే...కొనుగోళ్లుకూడా అక్రమంగా చోటుచేసుకుంటాయన్నారు. నల్లధనాన్ని బంగారం కొనుగోళ్లకు వినియోగిస్తారని చెప్పారు.  ప్రజలు రియల్ ఎస్టేట్  సంస్థల్లో,  బంగారం రూపంలో నల్లధనాన్ని  దాచిపెడుతున్నారనీ, అందుకే రియల్‌  ఎస్టేటే్‌ లో నల్ల ధనాన్ని ప్రవాహాన్ని  అడ్డుకోవాలంటే భూముల లావాదేవీలపై  స్టాంప్‌ డ్యూటీని భారీగా తగ్గించాలన్నారు.
అయితే డీమానిటైజేషన​ తరువాత 6 శాతం మాత్రమే బ్లాక్‌ మనీ మార్పిడి జరిగిందన్నవాదనలను ఆయన కొట్టి పారేశారు. అంతా వైట్‌ మనీ అయినపుడు  డీమానిటైజేషన్‌ కాలంలో ఇంత భారీ మొత్తంలో మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు