బోగస్ సర్టిఫికెట్తో ఎంపీ పదవి: వైఎస్సార్సీపీ

26 Nov, 2014 18:37 IST|Sakshi
బోగస్ సర్టిఫికెట్తో ఎంపీ పదవి: వైఎస్సార్సీపీ

అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. పాడేరు ఎమ్మెల్యే గిద్ది ఈశ్వరి, రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరి ఫిర్యాదు చేశారు. ఎంపీ గీత సోదరుడు వివేకానందకుమార్ ఎస్టీ కాదన్న డీఎల్ఎస్సీ నివేదికపై ఈనెల 28వ తేదీన కలెక్టర్ విచారణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో గీత, ఆమె సోదరుడు గిరిజనులు కారని ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు.

అయితే, ఎంపీ గీత సోదరుడి కులం వ్యవహారాన్ని గిరిజన సంక్షేమ శాఖ చూసుకుంటుందని కలెక్టర్ వారికి చెప్పారు. కలెక్టర్ నీతూకుమార్ ప్రసాద్ సమాధానంతో ఎమ్మెల్యేలు రాజేశ్వరి, ఈశ్వరి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ గీత ఎస్టీ కాదన్న విషయాన్ని కప్పిపుచ్చేందుకు టీడీపీ సర్కారు కుట్రపన్నుతోందని ఈశ్వరి ఆరోపించారు. చంద్రబాబు కుట్రను గిరిజనులమంతా కలిసి ఎదుర్కొంటామని ఈశ్వరి చెప్పారు. బోగస్ సర్టిఫికెట్తో ఎంపీ పదవిని అనుభవిస్తూ గీత గిరిజనులను మోసం చేస్తున్నారని ఆమె అన్నారు.

మరిన్ని వార్తలు