కార్యకర్తలే పార్టీకి బలం

18 Nov, 2018 11:42 IST|Sakshi
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి

గ్రామస్థాయి సమస్యలను గుర్తించి పరిష్కరించాలి

అనుబంధ విభాగాలు     జిల్లావ్యాప్తంగా పర్యటించాలి

పెండింగ్‌లో ఉన్న అనుబంధ కమిటీల నియామకాలు పూర్తి చేయండి

 వైఎస్సార్‌సీపీ సమీక్ష సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి

సాక్షి, తిరుపతి : పార్టీకి కార్యకర్తలే బలమని, వారు చేస్తున్న సేవలు మరువలేనివని, ఎలాంటి ఆపద వచ్చినా అండగా ఉంటామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత నిర్మాణాల వ్యవహారాల ఇన్‌చార్జ్, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ఉద్ఘాటించారు. తుమ్మలగుంటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, నగర అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 

సమావేశంలో మాజీ ఎంపీలు మిథున్‌రెడ్డి, వరప్రసాద్, ఎమ్మెల్యేలు దేశాయ్‌ తిప్పారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నారాయణస్వామి, చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్‌ సునీల్‌కుమార్, చిత్తూరు, తిరుపతి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి శ్రీనివాసులు, కిలివేటి సంజీవయ్య, కుప్పం, పలమనేరు, సత్యవేడు నియోజకవర్గాల సమన్వయకర్తలు చంద్రమౌళి, వెంకటేగౌడ్, ఆదిమూలం, యువ నాయకుడు భూమన అభినయరెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు హాజరయ్యారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పార్టీ అనుబంధ విభాగాలు గ్రామస్థాయిలో సమస్యలను గుర్తించి, పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అనుబంధ సంఘాల అధ్యక్షులు కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితం కాకుండా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి సమన్వయకర్తలకు సహకరించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న అనుబంధ కమిటీల నియామకాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. చేపట్టాల్సిన కార్యాచరణ, పార్టీ సంస్థాగత నిర్మాణం, కూర్పు, తదితర అంశాలపై చర్చిం చారు. అనంతరం జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యువత, విద్యార్థి విభాగం, మండల పార్టీ నాయకులు విజయసాయిరెడ్డిని కలిశారు.

మరిన్ని వార్తలు