లాభాల మార్కెట్లోనూ ఈ 9షేర్లు ఏడాది కనిష్టానికి...

16 Jul, 2020 12:31 IST|Sakshi

మిడ్‌సెషన్‌ కల్లా స్థిరంగా కదులుతున్న సూచీలు

33 షేర్లు ఏడాది గరిష్టానికి

మార్కెట్‌ ప్రారంభంలో తీవ్ర ఒడిదుడుకులను చవిచూసిన సూచీలు మిడ్‌సెషన్‌ సమయానికి స్థిరంగా కదులుతున్నాయి. ఐటీ రంగ షేర్ల ర్యాలీ సూచీల స్థిరమైన ట్రేడింగ్‌కు కారణవుతోంది. మధ్యాహ్నం 12గంటలకు 200 పాయింట్ల లాభంతో 36255 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి 10658 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఇన్ఫోసిస్‌ అండతో ఐటీ షేర్లు భారీగా లాభపడుతున్నాయి. ఐటీతో పాటు అటో, ఫైనాన్స్‌, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంక్స్‌, మీడియా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి.

9షేర్లు ఏడాది కనిష్టానికి: మార్కెట్‌ లాభాల్లో కొనసాగుతున్నప్పటికీ.., 9 షేర్లు మాత్రం ఏడాది కనిష్టానికి పతనమయ్యాయి. ఆర్తి సర్‌ఫ్యాక్టెంట్స్‌, బీ.సీ.పవర్‌ కంట్రోల్‌, మిట్టల్‌ లైఫ్‌ స్టైల్‌, ఓమెక్స్‌, యూనివస్తు ఇండియా, టచ్‌వుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మరో 3కంపెనీలు ఇందులో ఉన్నాయి. 

33 షేర్లు ఏడాది గరిష్టానికి: ఇదే సమయంలో ఓ 33 షేర్లు ఏడాది గరిష్టానికి చేరుకున్నాయి.  5పైసా క్యాపిటల్‌, బిర్లా సాఫ్ట్‌, ధనుకా అగ్రిటెక్‌, గీకాయ్‌ వైర్స్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, డాక్టర్‌ లాల్‌ పాథ్‌ ల్యాబ్స్‌, లారస్‌ ల్యాబ్స్‌, పరిసిస్టెంట్‌ సిస్టమ్స్‌, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌, టీసీఎస్‌, సువెన్‌ ఫార్మా, రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ షేర్లు అందులో ఉన్నాయి.

మరిన్ని వార్తలు