-
రూ. 2,400 కోట్ల పూచీకత్తు ఇవ్వండి
న్యూఢిల్లీ: తీవ్ర నిధుల కొరత ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా (ఏఐ) కొత్తగా మరిన్ని రుణాలు సమీకరించే ప్రయత్నాల్లో పడింది. నిర్వహణ అవసరాల కోసం కావాల్సిన నిధులను సమీకరించుకునేందుకు రూ.2,400 కోట్ల మేర పూచీకత్తు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఇవ్వనున్న దాదాపు రూ.7,600 కోట్ల గ్యారంటీలోనే ఇది భాగంగా ఉండనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రుణాలు, నష్టాలతో కుదేలవుతున్న ఎయిరిండియాను విక్రయించేందుకు కేంద్రం కసరత్తు చేస్తుండటం తెలిసిందే. 2018–19లో ఎయిరిండియా సుమారు రూ.8,556 కోట్ల నష్టాలు నమోదు చేసింది. కంపెనీ మూతబడకుండా కార్యకలాపాలు కొనసాగించేందుకు 2011–12 నుంచి కేంద్రం ఇప్పటిదాకా రూ.30,520 కోట్ల మేర తోడ్పాటు అందించిన సంగతి తెలిసిందే. -
తక్కువ వ్యయాల తో స్పైస్‌జెట్ కు లాభాలు
న్యూఢిల్లీ : స్పైస్‌జెట్ విమానయాన సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి రూ.72 కోట్ల నికర లాభం సాధించింది. సీట్ల అక్యుపెన్సీ అధికంగా ఉండడం, వ్యయాలు 42 శాతం తగ్గడం వల్ల ఈ స్థాయిలో లాభాలు సాధించామని స్పైస్‌జెట్ తెలిపింది. ఇంకా అధికంగా లాభాలు వచ్చేవని, అయితే ఎయిర్‌బస్ విమానాలను వెట్-లీజ్‌కు తీసుకున్నందున లాభం తగ్గిందని కంపెనీ చీప్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కిరణ్ కోటేశ్వర్ చెప్పారు. సంప్రదాయ లీజ్లతో పోల్చితే ఈ వెట్-లీజ్ ఖరీదైనదని, రూపాయి బలహీనపడడం వల్ల కూడా నికర లాభం తగ్గిందని వివరించారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు రూ.124 కోట్ల నష్టాలు వచ్చాయని పేర్కొన్నారు. వరుసగా ఏడు క్వార్టర్ల నష్టాలకు అడ్డుకట్ట వేస్తూ గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.22 కోట్ల నికర లాభం ఆర్జించామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో కూడా లాభాల బాట పట్టడంతో వరుసగా రెండు క్వార్టర్లలోనూ లాభాలు సాధించామని వివరించారు. అయితే అమ్మకాలు మాత్రం 34 శాతం క్షీణించి రూ.1,106 కోట్లకు తగ్గాయని పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడినట్లేనని వ్యాఖ్యానించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: నేను ఏమాత్రం సంతోషంగా లేను: ప్రీతి జింటా ట్వీట్ వైరల్
పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని
మళ్ళీ బీజేపీదే విజయం: యూపీ డిప్యూటీ సీఎం
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్‌తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement