పాపులర్ బ్రాండ్స్‌గా ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్

21 Jul, 2016 02:08 IST|Sakshi
పాపులర్ బ్రాండ్స్‌గా ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్

న్యూఢిల్లీ: దేశీయ విమానయాన రంగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సంస్థల్లో ఎయిర్ ఇండియా ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రైవేటు రంగంలో చూస్తే స్పైస్‌జెట్ ముందున్నట్టు మీడియా విశ్లేషణ సంస్థ ‘బ్లూబైట్స్’ పేర్కొంది. స్పైస్‌జెట్ తర్వాత జెట్‌ఎయిర్‌వేస్, ఇండిగో ఎయిర్‌లైన్స్ తదుపరి స్థానాల్లో ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు ‘భారతదేశపు అత్యంత ప్రాచుర్యం పొందిన విమానయాన బ్రాండ్స్ 2016’ పేరిట ఓ నివేదికను విడుదల చేసింది. అంతర్జాతీయ ప్రైవేటు ఎయిర్‌లైన్స్ విభాగంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రథమ స్థానంలో నిలవగా... ఎతిహాద్, ఎమిరేట్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొంది.

మరిన్ని వార్తలు