అరబిందో ఫార్మా ‘కొలెస్టరాల్’ ఔషధానికి ఎఫ్‌డీఏ అనుమతులు | Sakshi
Sakshi News home page

అరబిందో ఫార్మా ‘కొలెస్టరాల్’ ఔషధానికి ఎఫ్‌డీఏ అనుమతులు

Published Thu, Jul 21 2016 2:04 AM

అరబిందో ఫార్మా ‘కొలెస్టరాల్’ ఔషధానికి ఎఫ్‌డీఏ అనుమతులు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఫార్మా దిగ్గజం అరబిందో ఫార్మా రూపొందించిన రోసూవాస్టాటిన్ కాల్షియం ట్యాబ్లెట్లకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ నుంచి తుది అనుమతులు లభించాయి. గుండె జబ్బులను నిరోధించే దిశగా.. రక్తంలో కొలెస్టరాల్‌ను తగ్గించే చికిత్సలో ఈ ట్యాబ్లెట్లను ఉపయోగిస్తారు. ఐపీఆర్ ఫార్మాకి చెందిన క్రెస్టర్ ట్యాబ్లెట్లకు ఇవి జనరిక్ వెర్షన్. ఈ ఔషధ వార్షిక అమ్మకాలు దాదాపు 6.78 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అరబిందో ఫార్మాకి ప్రస్తుతం మొత్తం 274 జనరిక్ ఔషధాల అనుమతులు ఉన్నాయి. బుధవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు 5 శాతం లాభంతో రూ. 797.95 వద్ద ముగిసింది.

Advertisement
Advertisement