బంపర్‌ ఆఫర్లతో అమెజాన్‌ ప్రైమ్‌ డే -2019  

27 Jun, 2019 09:10 IST|Sakshi

అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ పండుగ 

కొత్త ఉత్పత్తులు, భారీ ఆఫర్లు

ఈసారి 48 గంటల పాటు   విక్రయాలు

తొలిసారిగా యూఏఈలో కూడా అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌

సాక్షి, న్యూఢిల్లీ: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వినియోగదారులకు  మరోసారి తీపి కబురు చెప్పింది. ప్రైమ్‌ డే 2019 సేల్‌ను  ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభించనుంది. ఈ మేరకు అమెజాన్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.  జూలై 15-19 తేదీల మధ్య  నిర్వహించ నున్న ఈ సేల్‌లో  వివిధ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తున్నట్టు వెల్లడించింది.

ముఖ‍్యంగా ఈసారి ప్రైమ్‌ డే సేల్‌ ను గ్లోబల్‌గా 48 గంటల పాటు అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపింది.  ఆపిల్‌, వన్‌ప్లస్‌, శాంసంగ్‌ తదితర ప్రముఖ కంపెనీల టీవీలు, స్మార్ట్‌ఫోన్లు తదితర ఉత్పత్తులను  ఈ సేల్‌లో తక్కువ ధరలకే తన ఫ్యాన్స్‌కు అందించనుంది. అలాగే హెచ్‌డీఎఫ్‌స క్రెడిట్‌, డెబిట్‌ కార్డు కొనుగోళ్లపై10శాతం ఇన్‌స్టెంట్‌ క్యాష్‌ బ్యాక్‌ను అందించనుంది.  ఇండియా, అమెరికా, కెనడా, యుకె, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, చైనా, బెల్జియం, ఆస్ట్రియాదేశాలతో పాటు ఈ ఏడాది యూఏఈలో ఈ  ప్రైమ్‌ డే సేల్‌ ను తొలిసారిగా పరిచయం  చేస్తోంది.

మరిన్ని వార్తలు