బయోకాన్ లాభం 79% అప్

28 Apr, 2016 02:25 IST|Sakshi
బయోకాన్ లాభం 79% అప్

న్యూఢిల్లీ: బయోటెక్నాలజీ దిగ్గజం బయోకాన్ నికర లాభం(కన్సాలిడేటెడ్)గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి 79 శాతం వృద్ధి చెందింది. 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.202 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.361 కోట్లకు పెరిగిందని బయోకాన్ తెలిపింది. అమ్మకాలు జోరుగా ఉండడం, రూ.268 కోట్ల అసాధారణ ఆదాయం కారణంగా నికర లాభం  పెరిగిందని కంపెనీ సీఎండీ కిరణ్ మజుందార్ షా చెప్పారు.  2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.830 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు  గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 17 శాతం పెరిగి రూ.970 కోట్లకు ఎగిశాయని వివరించారు.  ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బయోకాన్ షేర్  ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయి(రూ.581)ను తాకి చివరకు 1.2 శాతం లాభంతో రూ.571 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు