ఆర్థిక సర్వే-2019 : చాలా ఉత్సాహంగా ఉంది

2 Jul, 2019 18:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని  ప్రధాన ఆర్థిక సలహాదారు  కృష‍్ణమూర్తి సుబ్రమణియన్ (47) ట్వీట్‌ చేశారు. ఎన్‌డీఏ సర్కారు రెండవ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ మొట్టమొదటి ఆర్థిక సర్వే -2019ను   ప్రవేశపెట్టనున్నామని  మంగళవారం ట్వీట్‌ చేశారు 

కాగా   కేంద్ర ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్‌కు కూడా  తొలి మహిళా ఆర్థికమంత్రిగా కేంద్ర ప్రభుత్వ మొదటి పూర్తిస్థాయి బడ్జెట్‌ను  జూన్‌ 5వ శుక్రవారం ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంటులో  ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.  అయిదేళ్ల కనిష్టానికి పడిపోయిన జీడీపీ, 45 కనిష్టానికి పతనమైన నిరుద్యోగం లాంటి దేశీయ ఆర్థిక పరిస్థతులకు తోడు,  అంతర్జాతీయ ఆర్ధిక  అనిశ్చితి, ముదురు తున్న  ట్రేడ్‌ వార్‌ అందోళన నడుము  సీతారామన్‌   బడ్జెట్‌ కీలకంగా మారనుంది.  అరవింద్ సుబ్రమణియన్ పదవీకాలం ముగిసిన దాదాపు ఆరు నెలల తరువాత, కృష్ణమూర్తి సుబ్రమణియన్ గత ఏడాది డిసెంబరులో ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులైన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు