ఐఎన్‌ఎక్స్‌ కేసులో చిదంబరానికి ఎదురుదెబ్బ

30 Oct, 2019 18:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీ చిదంబరానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు బెయిల్‌ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో చిదంబరంను నవంబర్‌ 13 వరకూ జ్యుడిషియల్‌ కస్టడీకి తరలించింది. మరోవైపు చిదంబరం రిమాండ్‌ను మరొక రోజు పొడిగించాలన్న ఈడీ వినతిని కోర్టు తోసిపుచ్చింది. కాగా  చిదంబరంను ఈనెల 30 వరకూ ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఈనెల 24న కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. చిదంబరం కస్టడీ సమయంలో రెండు సార్లు ఆస్పత్రిలో చేరిన క్రమంలో విచారణ అసంపూర్తిగా సాగిందని, ఆయనను మరో రోజు తమ కస్టడీకి అప్పగించాలన్న ఈడీ వినతిని కోర్టు తోసిపుచ్చింది. ఇదే కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న చిదంబరానికి బెయిల్ లభించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు